- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సబ్బుతో స్నానం చేసినా వేల బ్యాక్టీరియాలు అక్కడే ఉంటాయి..!
దిశ, ఫీచర్స్: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రతీ రోజు స్నానం చేస్తుంటాం. దీని వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీయా పోతుంది. అంతేకాకుండా స్నానం చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. శరీరాన్ని శుభ్రపరుచుకోవడం కోసం సబ్బు, బాడీ వాష్‌లతో స్నానం చేస్తుంటారు. అయితే, స్నానం చేసిన తర్వాత కూడా శరీరంలోని ఒక భాగం అత్యంత మురికిగా ఉంటుందని, అందులో వేల బ్యాక్టీయాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదే నాభి భాగం. ఈ నాభిలో 2 వేలకు పైగా బ్యాక్టీరియాలు ఉంటాయని చెబుతున్నారు. మరొక విషయం ఏమిటంటే దీనిని శుభ్రం చేసినా కూడా ఇది మురికిగానే కనిపిస్తుంది.
పరిశోధన ప్రకారం: 2012 లో పీఎల్‌ఓఎస్ వన్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైనది. అందులో నాభి అత్యంత మురికిగా ఉండే ప్రాంతమని, ఇందులో 2,300 వందలకు పైగా బ్యాక్టీరియా ఉంటాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా ఈ నాభి ప్రాంతం ఎక్కువగా చెమటను ఉత్పత్తి చేస్తుంది. దీనిని శుభ్రం చేయకపోతే అందులో ఉండే తేమ వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. అందుకే స్నానం చేసిన ప్రతీసారి నాభిని శుభ్రం చేసుకోవడం మంచిది. దీనిని సరిగా శుభ్రం చేసుకోకపోతే ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, బిడ్డ పుట్టినప్పుడు తల్లి బొడ్డు నుంచి వేరు చేస్తే, శరీరంపై ఇది ఒక గాయంగా ఏర్పడుతుందని తెలిపారు. బొడ్డును శుభ్రం చేసుకోకపోతే కొన్ని రకాల సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. నాభిలో దురద రావడం, ఎర్రగా మారడం, బొడ్డులో నొప్పి, వాపు కనిపించినా జాగ్రత్తగా ఉండాలి. ఇది బొడ్డు హెర్నియా సమస్యకు కారణంగా చెప్పవచ్చు. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
Read More ...
ఇంట్లోనే డైమండ్ ఫేషియల్.. ఇలా చేసుకోండి..!