- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RBI కీలక నిర్ణయం.. ఆదివారం కూడా పనిచేయనున్న బ్యాంకులు!
దిశ, ఫీచర్స్ : బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్. బ్యాంకులకు ఆదివారం సెలవు అని అందరికీ తెలుసు. ప్రతి నెల ఆదివారం, రెండో శనివారం బ్యాంకులకు సెలవు దినాలు. అందువలన ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ చేసుకుంటారు. కానీ ఈ నెలలో ఆదివారం కూడా బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ ఏడాది మార్చి31 ఆదివారం కానుంది. దీంతో ఈ మేరకు బుధవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 ఆదివారం ప్రభుత్వ రంగ PSU బ్యాంకులన్నీ యథావిధిగా సేవలు అందిస్తాయని ప్రకటించింది.
అయితే ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు రోజు ఆదివారం కావడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్చి 31న ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తారు. బ్యాంకు దస్త్రాల ఆడిటింగ్ కోసం ఏప్రిల్ 1న లావాదేవీలు నిర్వహించరు, కాబట్టి సెలవు దినమైనా ఆదివారం రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయాలని RBI సూచించింది.
2023-24 ఆర్ధిక సంవత్సరం ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీలను, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగా కొనసాగించాలని తెలిపింది. RBI ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఆదివారం యథావిధిగా పనిచేయనున్నాయి.