- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
August 16: వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా పెట్టాల్సిన నైవేద్యం.. ఆ రోజు చేయాల్సిన, చేయకూడని పనులు!
దిశ, ఫీచర్స్: వరలక్ష్మి వ్రతం తెలుగు రాష్ట్రాల్లోని మహిళలందరికీ అతి ముఖ్యమైన వ్రతం. స్త్రీలంతా ఎంతో నిష్ఠతో కొలిచే వరలక్ష్మి దేవత విష్ణు మూర్తి సతీమణి. ఈ అమ్మని అడగ్గానే వరాలు ఇచ్చే దేవతగా మహిళలంతా ఆరాధిస్తారు. కాగా తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది వరలక్ష్మి వత్రం ఆగస్టు 16 వ తారీకున వస్తుంది. దీంతో స్త్రీలంతా వ్రతానికి కావాల్సిన సామాగ్రి, తాము ధరించే బట్టలు అన్ని సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే పూజలో అమ్మవారికి సమర్పించాల్సిన వాటిల్లో నైవేద్యం కూడా ముఖ్యమైనది.
కాగా కొంతమంది అమ్మవారికి ఏఏ నైవేద్యాలు చేయాలని కన్ఫూజ్ అవుతారు. వారికోసం తాజాగా జ్యోతిష్య పండితులు లక్ష్మిదేవికి ఈ నైవేద్యం చేస్తే ఎంతో సంతోషిస్తుందని, అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని చెబుతున్నారు. మరీ ఆ నైవేద్యం ఏంటనుకుంటున్నారు? అందరూ ఇష్టపడే.. అవి చూడగానే నోరూరే జౌట్లు. వీటినే పొంగనాలు అంటారు. అలాగే పాకం గారెలు కూడా అమ్మవారికి సమర్పించడం మంచిదేనంటున్నారు.
వరలక్ష్మి వ్రతం నాడు చేయాల్సిన పనులు..
వరలక్ష్మి వ్రతం నాడు ఇంట్లో అందరూ ఉదయం నిద్రలేచి ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా దేవుడి గదిని శుభ్రపరుచుకోవాలి. వరలక్ష్మి వ్రతం చేసే వారు ముందు రోజు నుంచే తమ భాగస్వాములకు దూరంగా ఉండాలి. అలాగే వ్రతంలో కూర్చున్నంతసేపు మనసు మొత్తం పూజ మీదనే ఉంచాలి. వ్రతం చేసినవారు ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండాలి. కేవలం రాత్రి మాత్రమే అమ్మవారికి సమర్పించిన నైవేద్యం ఆరగించాలి. ఈ విధంగా చేస్తే అమ్మవారిని కోరిన కోరికలు నెరవేరుస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వరలక్ష్మి వ్రతం నాడు చేయకూడని పనులు..
వరలక్ష్మి వ్రతం చేసే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ మాంసాహారాలను తినకూడదు. ముందు రోజు నుంచే తినకుండా ఉండడం మేలు. ఇతరులను దురుద్దేశంతో ఆరోపణలు చేయకూడదు. ఆ రోజు మొత్తం మంచి మనసుతో ఆలోచించాలి. ఇతరుల చెడు కోరుకోవద్దు. భర్య భర్తలు శారీరకంగా కలవకూడదు. వరలక్ష్మి వ్రతం నాడు ఈ నియమాలు పాటిస్తే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తుందని పండితులు అంటున్నారు.
గమనిక: పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. దీనిని దిశ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.