డిజిటల్ చైల్డ్‌హుడ్.. ఒక్క లైక్ కోసం పిల్లలు చేస్తున్న పనికి షాక్ అవ్వాల్సిందే..

by Sujitha Rachapalli |
డిజిటల్ చైల్డ్‌హుడ్.. ఒక్క లైక్ కోసం పిల్లలు చేస్తున్న పనికి షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : ఇంట్రడ్యూసింగ్ మై చైల్డ్ ఇన్‌టూ సోషల్ మీడియా.. .. క్యూట్ అండ్ బబ్లీ గర్ల్.. మా గారాల పట్టి బుజ్జి బుజ్జి మాటలు.. మా చిన్నోడి చిన్ని చిన్నిఅడుగులు.. ఇలా అప్పుడే పుట్టిన బేబీని ఆన్‌లైన్‌లోకి తీసుకొస్తున్నాం. లైక్స్, షేర్స్ కొట్టేస్తున్నాం. ఇంత వరకు బాగానే ఉంది కానీ మీ పిల్లాడి లైఫ్ మీరే స్పాయిల్ చేస్తున్నారనే విషయం మరిచిపోతున్నారు. స్వయానా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్.. నా పిల్లలను సోషల్ మీడియా వినియోగానికి దూరంగా ఉంచుతానని స్టేట్‌మెంట్ ఇచ్చినా సరే.. వాళ్లు ఇలాగే చెప్తున్నారని లైట్ తీసుకుంటున్నాం. కానీ ఈ అలవాటు చిన్నారుల భవిష్యత్తును చాలా స్ట్రాంగ్‌గా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనేగా మీ అనుమానం. అది కూడా తెలుసుకుందాం.

తప్పు తల్లిదండ్రులదే ??

సోషల్ మీడియా నెట్‌వర్క్స్ తమకు లాభాలు తెచ్చిపెట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. పెద్దలనే కాదు పిల్లలను కూడా వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేవు. ముఖ్యంగా ఫేస్ బుక్ లాంటి నెట్‌ వర్క్స్‌ చిన్నారులు స్క్రీన్స్‌కు గ్లూ మాదిరిగా అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే

ఆరేళ్ల పిల్లలు సైన్‌అప్ చేయకపోయినా సరే మెసేంజర్ వాడుకునేందుకు అనుమతిస్తున్నాయి. చెడగొట్టే ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. కానీ అదే సందర్భంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ లాంటి టెక్ దిగ్గజాలు తమ పిల్లలను సోషల్ మీడియా వాడేందుకు పర్మిషన్ ఇవ్వబోమని పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదే ఫాలో అవుతున్నారు. కానీ మనం మాత్రం మనతోపాటు పిల్లలను ఆ సామాజిక మాధ్యమంలో పడేసి చిత్ర విచిత్రంగా మారుస్తున్నాం. వారి పిల్లలు టెక్నాలజీ వినియోగించి ఎదుగుతుంటే.. మన చిన్నారులు మాత్రం ఈ సోషల్ మీడియా వినియోగించి డౌన్ ఫాల్ అవుతున్నారనే ఆందోళన చెందుతున్నారు ఎక్స్‌పర్ట్స్.

పిల్లలకు సొంత ఫోన్లు

USలో 71% మంది టీనేజర్లు కనీసం ఒక సోషల్ మీడియా ప్రొఫైల్‌ను కలిగి ఉన్నారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో రోజుకు మూడు గంటలు గడుపుతున్నారు. నాలుగు శాతం మంది దాదాపు 24గంటలు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. వయో పరిమితులు ఉన్నప్పటికీ చాలా ప్లాట్ ఫామ్స్ చిన్నారులను ఇందుకు అనుమతిస్తున్నానే ఉన్నాయి. యూకే లెక్కల ప్రకారం 11-12 ఏళ్ల పిల్లలు దాదాపు సగం మంది, పది సంవత్సరాల పిల్లలు 28శాతం మంది ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఎకౌంట్స్ కలిగి ఉన్నారు. స్క్రీన్ టైమ్ రోజురోజుకు పెంచేస్తున్నారు. మూడేళ్ల పిల్లల్లో సగం మంది, 5-7 ఏళ్ల పిల్లల్లో 79 శాతం, 8-11 సంవత్సరాల పిల్లల్లో 94శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఇందులో కొంత మంది సొంత మొబైల్స్, ట్యాబ్స్ కలిగి ఉన్నారు కూడా. ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యం, మెదడును ప్రభావితం చేస్తున్నాయి.

మనుషులను చదవలేరు

ఒకప్పుటి బాల్యం ఆరు బయట అందరు పిల్లలతో కలిసి ఆడుకోవడమే కానీ ఈ డిజిటల్ యుగంలో డిజిటల్ చైల్డ్‌హుడ్ మాత్రమే కనిపిస్తుంది. స్క్రీన్ సమయం పెరగడం వల్ల ముఖాముఖి సంభాషణలలో మానవ భావోద్వేగాలను చదవగల పిల్లల సామర్థ్యం దిగజారిపోతుంది. అయితే వినియోగించడం మానేస్తే దానిని తిరిగి పొందవచ్చు. మరోవైపు సోషల్ మీడియా వాడకం ద్వారా ఆన్‌లైన్ వాతావరణంలో ఫ్రెండ్‌షిప్స్ ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి. కాబట్టి పిల్లలు ఈ స్నేహాలు చాలని ఫీల్ అవుతున్నారు. బయటకు వెళ్లి కమ్యూనికేట్ అయ్యేందుకు ట్రై చేయడం లేదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో వారు ఎప్పుడు, ఎవరితో కమ్యూనికేట్ చేయాలో ఎంచుకోవచ్చు.అసహ్యకరమైన సంభాషణలను నివారించవచ్చు లేదా ఆలస్యంగా సమాధానం ఇవ్వవచ్చు. ఇది ఇతరులతో ముఖాముఖి మాట్లాడేటప్పుడు సాధ్యం కాదు. అంటే ఈ పద్ధతి వారిని నిజ జీవిత పరిస్థితులకు సిద్ధంగా లేకుండా చేస్తుంది.

అటెన్షన్.. అడిక్షన్

దాదాపు రెండు లక్షల మంది టీనేజర్స్‌పై చేసిన అధ్యయనం.. సోషల్ మీడియా వినియోగం, ADHD( అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ - ఏకాగ్రత లోపం వ్యాధి) మధ్య గణనీయమైన సహసంబంధాన్ని చూపిస్తుంది. వీటిలో అటెన్షన్ చూపించకపోవడం, హైపర్యాక్టివిటీ, హఠాత్తుగా రియాక్ట్ కావడం వంటివి ఉన్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పెరుగుతున్న ADHD రేట్లు సోషల్ నెట్‌వర్క్‌ల ఆగమనంతో సమానంగా ఉన్నాయి. ఈ ఆందోళనకరమైన గణాంకాలకు Facebook, లైక్‌లు కారణంగా ఉన్నాయనేది నిపుణుల మాట. ఎందుకంటే 78% మంది టీనేజర్స్ కనీసం గంటకోసారి ఫోన్‌ చెక్ చేస్తారు. 50% మంది తమ ఫోన్‌లకు బానిసలు అయిపోయారు. పిల్లలు, టీనేజర్స్‌లో విమర్శనాత్మక ఆలోచన, నిర్ణయం తీసుకోవడంతో సంబంధం ఉన్న మెదడులోని ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కానీ లైక్‌ల-ప్రేరిత డోపమైన్ వల్ల కలిగే హార్మోన్ల సుడిగుండం.. త్వరగా సోషల్ మీడియా వ్యసనానికి దారితీస్తుంది. లైక్‌లను చూడటం అనేది టీనేజర్ల మెదడులకు చాక్లెట్ తినడం లేదా డబ్బు గెలుచుకున్నంత హాయిగా ఉంటుంది. నిజానికి సోషల్ మీడియా బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్‌ను సులభంగా సక్రియం చేయగలదు. క్లిక్‌లు, లైక్‌లను కరెన్సీగా అందించగలదు. కాబట్టి ఇన్‌స్టాంట్ శాటిస్‌ఫాక్షన్ - వెంటనే అటెన్షన్ పొందే అవకాశం - మాదకద్రవ్యాల బానిసల మాదిరిగానే అడిక్షన్ సృష్టిస్తుంది. దీనికి తోడు నిద్రలేమితో పిల్లలను అనారోగ్యం చుట్టుముడుతుంది.

టెక్స్‌టింగ్.. ఫెయిలింగ్..

సోషల్ మీడియా యూజర్స్ ముఖ్యంగా పిల్లలు ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేందుకు టెక్స్ట్ మెసేజ్ వినియోగిస్తారు. ఇలాంటి పద్ధతి ఫాలో అవుతున్న టీనేజర్స్ చదువుల్లో వెనుకబడి ఉన్నారని.. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం చెప్తుంది. అయితే వీరు గ్రామర్ మరిచిపోవడం లేదని.. ఫాస్ట్ రీడింగ్, క్రియేటివ్ రైటింగ్‌లో తమ ప్రతిభను చూపుతున్నారని తేలింది. అయితే వీరు కాన్సంట్రేట్ చేయడం.. డీప్ లెవల్‌లో నేర్చుకోవడం, ఆలోచించడం, కమ్యూనికేట్ కావడంలో ఫెయిల్ అవుతున్నారు.

Next Story

Most Viewed