- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎదుటి వారిని చూసి అసూయ పడుతున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మనిషికి అసూయ ఉండటం చాలా కామన్. ఎదుట వ్యక్తి మన కంటే అందంగా ఉన్నా, డబ్బు, బంగారం ఉండి సంతోషంగా జీవిస్తున్నా మనం తట్టుకోలేము. అంతే కాకుండా మనం ప్రేమించిన వ్యక్తి మనతో కాకుండా వేరే వ్యక్తులతో క్లోజ్‌గా ఉన్న అసూయ కలుగుతోంది. ఇలా ప్రతి చిన్న చిన్న విషయాలకు ఆటోమేటిక్‌గా మనకు అసూయ పుట్టుకుస్తోంది. ఇలా అయితే మనం జబ్బుల బారిన పడినట్లే అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఆ జబ్బు ఏంటి అనుకుంటున్నారా.. ఆ జబ్బు పేరు మరేదో కాదు అసూయనే.
అసూయ అనే జబ్బు ఎవరికైతే ఉంటుందో వాళ్లు అనేక అనారోగ్యాల బారిన పడతారట. ఎందుకంటే అసూయ ఉన్నవాళ్లు ఎదుట వారిని చూసి ఓర్వలేరు. వారు సంతోషంగా ఉంటే తట్టుకోలేరు. దీంతో కోపం వస్తుంది. కోపం కారణంగా బీపీ వస్తుంది.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి పుట్టుకొచ్చి మన చావు మీదకు తెస్తుంది. కాబట్టి ఎదుటి వారిని చూసి అసూయ పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
అసూయ నుంచి బయట పడాలంటే అసలు ఏం చేయాలి..
* అసూయ నుంచి బయట పడాలంటే ముందు మీరు ఏ విషయానికి జెలస్‌గా ఫీలవుతున్నారో కనిపెట్టగలగాలి. దాని నుంచి కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది.
* మన కంటే డబ్బు, సౌకర్యాలతో జీవించే వారి గురించి ఆలోచిస్తే మనలో అసూయ పుట్టుకొస్తుంది. దీంతో దుఖః కూడా కలుగుతుంది. కాబట్టి మన కంటే పెద్ద వారితో కాకుండా చిన్న వాళ్లతో పోల్చుకుంటే సంతృప్తి కలుగుతుంది.
* చాలా మంది తమకు ఉన్న వాటిని పక్కన పెట్టి లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది కూడా అసూయకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి.. మొదట మన దగ్గర ఉన్న వాటి గురించి ఆలోచించి అవి మన నుంచి దూరం కాకుండా కాపాడుకోవాలి.
* ఇలా అసూయను కంట్రోల్ చేసుకోగలిగితే ఎటువంటి సమస్యలు రావు అంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి:
అపరిచితులతో భార్యల శృంగారం.. దగ్గరుండి పంపిస్తున్న భర్తలు.. ఏకంగా ఏడుసార్లు సెక్స్!