Watermelon: పుచ్చకాయ ఎర్రగా ఉందని తెగ తినేస్తున్నారా? క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్లే!

by D.Reddy |   ( Updated:2025-03-09 15:55:56.0  )
Watermelon: పుచ్చకాయ ఎర్రగా ఉందని తెగ తినేస్తున్నారా? క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్లే!
X

దిశ, వెబ్ డెస్క్: ఎండకాలం (Summer) వచ్చేసింది. పుచ్చకాయల (Watermelon) సీజన్ కూడా ప్రారంభమైంది. సమ్మర్‌లో నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయలను అందరూ ఇష్టంగా తింటారు. దీంతో మార్కెట్లలో జోరుగా పుచ్చకాయల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక డిమాండ్ దృష్ట్యా మార్కెట్‌లో కొన్ని ప్రాంతాల్లో కల్తీ పుచ్చకాయల్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు, అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించడం తప్పనిసరి. లేదంటే ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే. ఈ సందర్భంగా కల్తీ పుచ్చకాయల్ని ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం.

వేసవిలో పుచ్చకాయలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పకన్కర్లేదు. ఈ నేథ్యంలోనే పుచ్చకాయల సేల్స్ పెంచుకునేందుకు అవి ఎర్రగా కనిపించడానికి కొన్ని రసాయనాలు కలుపుతారు. ముఖ్యంగా ఎరిథ్రోసిన్ రసాయనాన్ని పుచ్చకాయల్లో ఇంజెక్ట్ చేస్తారు. ఇది కాయ లోపలి భాగాన్ని కూడా ఎర్రగా మారుస్తుంది. ఇక ఈ ఎరిథ్రోసిన్ అధిక మొత్తంలో శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో ఎరిథ్రోసిన్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని వెల్లడైనట్లు వివరించారు. అలాగే, ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలకు కారణమవుతుందని చెబుతున్నారు.

కల్తీ పుచ్చకాయను గుర్తించండిలా..

పుచ్చకాయ సహజంగా పండింగా.. ఎరిథ్రోసిన్‌ను ఇంజెక్ట్ చేసి పండించరా అన్న విషయం తెలుసుకోవడం కొంచెం కష్టం. అయితే దీని కూడా ఒక సింపుల్ టెస్టుతో దీన్ని తెలుసుకోవచ్చు. మార్కెట్‌కు పుచ్చకాయ కొనడానికి వెళ్లినప్పుడు, ముందుగా దాని ముక్కను కోసి ఇవ్వమని అడగాలి. ఆ తర్వాత ముక్కపై దూదితో లేదా టిష్యూ పేపర్‌తో అక్కడక్కడా రుద్దాలి. దూది ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారితే, దానిలో రసాయనాలు కలిపారని అర్థం. దూది ఎరుపు రంగులోకి సహజంగా పండినట్లు అర్థం.

అలాగే, పుచ్చకాయలో అక్కడక్కడ కొద్దిగా తెలుపు, పసుపు ఉంటే, అది కల్తీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయలను త్వరగా పండించడానికి కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల, పుచ్చకాయ పైభాగంలో పసుపు రంగులో ఉంటుంది. తినడానికి ముందు ఉప్పు నీటిలో బాగా కడగడం మంచిది. పుచ్చకాయ కొనేటప్పుడు, మీరు దానిని జాగ్రత్తగా పరిశీలించాలి. కల్తీ పుచ్చకాయ అయితే, కోసినప్పుడు పండ్లలో ఎక్కువ పగుళ్లు ఉంటాయి. అందువల్ల, పుచ్చకాయ కొనేటప్పుడు, కొన్న తర్వాత ఈ దశలను పాటిస్తే, అది కల్తీదా?లేదా? అని సులభంగా గుర్తించవచ్చని నిపుణులు అంటున్నారు.


Read Also..

మానవ శరీరంలో కొత్త అవయవాన్ని గుర్తించిన పరిశోధకులు.. ఏ బాడీ పార్ట్‌లో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Next Story