- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీపీ లేదనుకుని ఉప్పు ఎక్కువ తింటున్నారా.. అయితే, వీటి గురించి తెలుసుకోవాల్సిందే
దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి. ఈ సమస్య ప్రధానంగా 50 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. అయితే ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపుటలవాట్లలో వచ్చిన మార్పుల 25 ఏళ్ల వారు కూడా రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుందన్నవిషయం తెలిసిందే. అందుకే అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే, కొంత మంది బీపీ లేదని ఉప్పు ఎక్కువగా తింటుంటారు. ఈ విషయం మీద పరిశోధనలు చేసిన నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం..
సాధారణ రక్తపోటు ఉన్నవారు కూడా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె, మెదడు రక్తనాళాల్లో ఫలకం ఏర్పడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రీయ నిపుణులు చేసిన పరిశోధనలో ఇది తేలింది. ఉప్పు ఎక్కువగా తీసుకునేవారిలో అధిక రక్తపోటు రాకముందే రక్తనాళాలు దెబ్బతింటాయని పరిశోధనలో తేలింది. ఉప్పు రక్తపోటును పెంచుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం రోజుకు ఒక స్పూన్ ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదని సిఫార్సు చేసింది.