సమ్మర్‌లో కర్బూజ తిని గింజలు పడేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

by Disha Web Desk 6 |
సమ్మర్‌లో కర్బూజ తిని గింజలు పడేస్తున్నారా.. వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
X

దిశ, ఫీచర్స్: గత కొద్ది రోజుల నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తూ ప్రజలకు పగటి పూట చుక్కలు చూపిస్తున్నాడు. ఏకంగా రోజులో 40 డీగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనాలు బయటకు పోవాలంటేనే భయపడిపోతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక ఇంట్లోనే ఉండటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే ఉద్యోగాలకు వెళ్లేవాళ్ళు సమ్మర్‌లో అందుబాటులో ఉండే పండ్లు బాక్స్‌లో పెట్టుకుని మరీ వెళుతున్నారు. అయితే ఎండాకాలం విరివిగా దొరికే ఫ్రూట్స్‌లో కర్బూజ కూడా ఒకటి.

దీనిని తినడం వల్ల శరీరానికి నీటి శాతం అందడం వల్ల డీహ్రైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండటంతో పాటుగా.. పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుకోవచ్చని ప్రజలు ఎక్కువగా తింటుంటారు. అయితే ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, పోషకాలు, ప్రొటీన్లు, సోడియం, మెగ్నీషియం, విటమిన్స్, మినరల్స్, డైటరీ, ఫైబర్ వంటివి ఉండి పలు రకాలు ప్రయోజనాలు కలిస్తాయి. అయితే కర్బూజను తిని కొందరు గింజలు పనికిరావని పడేస్తుంటారు. కానీ వాటితో కూడా మన శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

* ఇటీవల కాలంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా గుండె సమస్యలు వచ్చి సడెన్‌గా ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. గుండె పోటు వచ్చినట్లు వారికే తెలియక ముందే మృతి చెందుతుండటంతో.. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే గుండె సమస్యలు రాకుండా ఉండటానికి కర్బూజ గింజలు సహాయపడతాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

*ఎండాకాలం చెమట వల్ల లేదా ఇతర కారణాల వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుని వాటి నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే కర్బూజ గింజలు తీసుకోవడం మంచిది. వాటిల్లో ఉండే విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

* ఎండలకు చాలామందికి జీర్ణ సమస్యలు ఏర్పడుతాయి. దీంతో అన్నం తినాలంటేనే భయపడిపోతుంటారు. అలాంటి వారు కర్బూజ గింజలు తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులో డైటరీ ఫైబర్ ఉండటం వల్ల ప్రేగు కదలికలు సులభతరం చేస్తాయి. అలాగే మలబద్దకాన్ని తగ్గిస్తాయి.

* చెమటలకు చాలా మందికి చర్మ సమస్యలు వచ్చి పలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అలాగే చర్మం పొడి పారటం వంటివి తలెత్తుతాయి. కాబట్టి కర్బూజ గింజలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల.. సమస్యలన్నీ తొలగి పోయి మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

* కర్బూజ గింజల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు బలంగా ఉండేలా చేసి నొప్పి రాకుండా కాపాడుతాయి.



Next Story

Most Viewed