బ్రేక్ ఫాస్ట్‌లో చద్దన్నం తింటున్నారా..? అయితే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..

by Kavitha |
బ్రేక్ ఫాస్ట్‌లో చద్దన్నం తింటున్నారా..?  అయితే తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
X

దిశ, ఫీచర్స్: భారత దేశంలో చాలా మంది పెరుగుకు అలవాటుపడి ఉంటారు. ఎన్ని కూరలతో తిన్న చివరికి పెరుగుతో తినకుండా భోజనం ముగించరు. అయితే చాలా మంది కర్డ్‌ను మధ్యాహ్నం లేదా రాత్రికి ఎక్కువగా తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్‌గా దోశ, ఇడ్లీ, బొండా, పెసరట్టు, ఉప్మా వంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మరికొంత మందికి బ్రేక్ ఫాస్ట్ చేయడమంటేనే చాలా బద్ధకం. అలా బ్రేక్ ఫాస్ట్‌ను స్కిప్ చేసేసి డైరెక్ట్ లంచ్ చేసేస్తుంటారు కొంతమంది. మరికొందరేమో.. ఏదో ఒకటి కడుపులో పడేస్తే.. అలా ఉంటుంది కదా అని ఏది పడితే అది తినేస్తారు. దీనివల్ల అనారోగ్యం పాలవుతారు. అయితే అప్పట్లో మన పెద్దలు చద్దన్నం తిని ఎంత ఆరోగ్యంగా ఉండేవారో మనందరికీ తెలిసిందే. వారికి ఎలాంటి వ్యాధులు కూడా వచ్చేవి కావు. ఇక మనం తినే ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే అల్పాహారం సరిగా తీసుకోవాలి. మనం ఉదయం పూట తినే ఫుడ్డే మనం రోజంతా ఎలా ఉంటామో డిసైడ్ చేస్తుంది. అందుకే నిపుణులు కూడా కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయండి అని చెబుతారు. అయితే మనం మార్నింగ్ తినే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉంటే అంత మంచిది. మార్నింగ్ తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలంటే.. చద్దన్నంలాంటివి తినడం ఇంకా బెటర్. మరి ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా చద్దన్నం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం చూద్దాం..

*చద్దన్నం తయారీ:

చద్దన్నం కోసం ముందురోజు రాత్రే అన్నం కొద్దిగా ఎక్కువగా వండుకోవాలి. అలా వండుకున్న రైస్‌లో పాలు పోయాలి. అనంతరం తోడు పెట్టాలి. దీంతో రాత్రికి రాత్రి అది పులుస్తుంది. ఉదయం వరకు చద్దన్నంగా తయారవుతుంది. అయితే రాత్రి మట్టి కుండలో ఉంచితే ఇంకా మంచిది. దీని వల్ల అది ఇంకా టేస్టీగా అవుతుంది. ఇలా తయారైన చద్దన్నం మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లాగా తీసుకోండి. అందులో నిమ్మకాయ రసం పిండి.. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో కలిపి తింటే అమృతంలా ఉంటుంది.

*చద్దన్నంతో లాభాలు:

1) చద్దన్నంలో అనేక పోషకాలు ఉన్నాయి. అలాగే ఇందులో కార్బొహైడ్రేట్లు, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్‌, కాల్షియం సమృద్ధిగా దొరుకుతాయి. దీని వల్ల మీ శరీరానికి శక్తి వస్తుంది.

2) అదే విధంగా ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రోజంతా పని చేయడానికి కావలసిన శక్తి వస్తుంది. నీరసం, నిస్సత్తువ తగ్గి చురుగ్గా పని చేస్తారు.

3) దీనిలో మన జీర్ణవ్యవస్థకు అవసరం అయ్యే.. మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడమే కాకుండా మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది.

4) అంతేకాక ఇది తింటే.. అల్సర్ తగ్గుతుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యం కూడా సరిగ్గా అవుతుంది.

5) ఎవరికైనా శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే చద్దన్నం తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. వేసవిలో అయితే చద్దన్నం ఇంకా మంచిది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story