పిచ్చి ఆకులని పడేస్తున్నారా.. వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

by Prasanna |   ( Updated:2024-10-03 16:24:36.0  )
పిచ్చి ఆకులని పడేస్తున్నారా..  వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధరాణంగా ప్రతీ ఇంట్లో అనేక రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో కొంతమంది వాము ఆకులను కూడా బాగా పెంచుతుంటారు. వీటిని చూడగానే పిచ్చి ఆకులని అనుకుంటారు. కానీ, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే, ఈ ఆకులను ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేదంలో వాము ఆకులను చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. దీనిని అజ్వైన్‌ అని కూడా అంటారు. వామును గింజలను వంటల్లో కూడా వాడుతుంటారు. అంతేకాకుండా, వాము తినడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.

వాము ఆకులు తినడం వలన గ్యాస్‌, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా, బరువు ఉన్న వారు దీనిని వాము ఆకులు తినడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. అలాగే, ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారు. అంతేకాకుండా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్మ్యూనిటీ పవర్ ని మెరుగుపరుస్తాయి.

Advertisement

Next Story