- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దోమల బెడద వేధిస్తోందా?.. అయితే ఇంటి ముందు ఆ మొక్కలు నాటండి!
దిశ, ఫీచర్స్: ఈ రోజుల్లో సీజన్‌తో సంబంధం లేకుండా దోమల బెడద పెరుగుతోంది. వాతావరణ కాలుష్యం, రోడ్లపై మురుగు పారడం, నీళ్లు నిలవడం ఇలా కారణాలేమైనా వాటి సంఖ్య పెరగడం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. వాటిని తరిమేందుకు తరుచుగా ఆల్ ఔట్, కాయిల్స్ లాంటివి వాడుతుంటారు. అవి పెద్దగా ప్రభావం చూపకపోగా, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో ప్రత్యామ్నాయం ఏంటనే దానికి కొన్ని రకాల మొక్కలు మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇంటి పెరట్లోనో, పరిసరాల్లోనో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయని చెప్తున్నారు.
లావెండర్, పుదీనా
ఇది సువాసనగల మొక్క. దీనిని ఇంటి ముందు, చుట్టుపక్కల పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే పుదీనా కూడా మంచి క్రిమి సంహారిణిగా పనిచేస్తుందట. ఇంటి ముందు కుండీల్లో పుదీనా మొక్కలు పెంచినట్లయితే ఇంటి అవసరాలకు ఉపయోగపడటమేగాక, వివిధ రోగాలకు కారణమయ్యే దోమలు రాకుండా ఉంటాయి.
రోజ్మెరి, తులసీ
రోజ్మెరీ, తులసీ మొక్కలు ఉన్న పరిసరాల్లోకి కూడా దోమలు రావడానికి ఇష్టపడవు. రోజ్మెరీ ఇంటి అందాన్ని, అలంకారాన్ని పెంచుతుందనే ఉద్దేశంతో నాటుతుంటారు. కానీ ఇది దోమలు రాకుండా కూడా అడ్డుకుంటుంది. ఎందుకంటే దీని నుంచి వెలువడే వాసనను అవి తట్టుకోలేవు. ఇక తులసి మొక్క గురించి అందరికీ తెలిసిందే. మన దేశంలో దీనిని పవిత్రమైనదిగా భావిస్తూ పూజిస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగుండటమేగాక, దాని వాసన కారణంగా దోమల నివారణిగా కూడా పనిచేస్తుంది.
Also Read..
రెడ్ రైస్ తింటే ఏమవుతుందో తెలుసా?
కొత్తగా పెళ్లైన జంట చేసే ప్రయాణాన్ని హనీమూన్ ఎందుకు అంటారో తెలుసా?