Anxiety: రాత్రిళ్లు పెరుగుతున్న మానసిక ఆందోళన.. ఎలా బయపడాలో చెప్తున్న నిపుణులు

by Javid Pasha |   ( Updated:2024-08-20 11:10:40.0  )
Anxiety: రాత్రిళ్లు పెరుగుతున్న మానసిక ఆందోళన.. ఎలా బయపడాలో చెప్తున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : కారాణాలేమైనా ప్రస్తుతం చాలామందిలో మెంటల్ యాంగ్జైటీస్ పెరిగిపోతున్నాయి. బిజీ లైఫ్ షెడ్యూల్, వర్క్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఇందుకు కారణం అవుతున్నాయి. పొద్దస్తమానం పనిలో నిమగ్నమై మిగతా విషయాలు పట్టించుకోని వారు కూడా రాత్రిళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు తరచుగా ఆందోళన చెందేపరిస్థితి ఇప్పుడు యువతలో, పెద్దల్లో పెరిగిపోతోందని నిపుణులు అంటున్నారు. కాగా రాత్రిపూట ఆందోళనతో గుండె దడ, అలసట పెరగడం, ఏకాగ్రత లోపించడం, కండరాల సంకోచం వంటి సమస్యలు కూడా బాధితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు కాబట్టి ఆలోచనలు మెదడును ప్రభావితం చేస్తుంటాయి. సమస్యల్లో ఉన్నవారు వాటిని మరింత లోతుగా ఊహించుకొని ఆందోళన పడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి క్రమంగా నిద్రలేమికి కూడా దారితీస్తుంది.

కార్టిసాల్ పెరుగుదల

రాత్రిపూట మాత్రమే ఎక్కువ ఆందోళన చెందడానికి కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ప్రధాన కారణం. వాస్తవానికి ఇది బాడీ సిర్కాడియన్ రిథమ్ ఆధారంగా వర్క్ చేస్తుంది. వివిధ సమస్యలు, పొద్దస్తమానం ఎదుర్కొన్న చేదు అనుభవాలను తలచుకొని బాధపడేవారిలో ఇది పెరిగిపోయి మరింత ఆందోళనకు కారణం అవుతున్నట్లు మానసిక నిపుణుుల పేర్కొంటున్నారు.

రేసింగ్ థాట్స్

పగలు ఏదో ఒక బిజీలో ఉంటాం. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే చుట్టు పక్కల జనాలు ఉంటారు. ఆఫీసుల్లో ఉన్నప్పుడు కొలీగ్స్, ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే గమనించి వెంటనే విషయం తెలుసుకొని మనల్ని ఆ పరిస్థితి నుంచి డైవర్ట్ చేయడం ద్వారా ఆందోళన నుంచి బయటపడేస్తారు. కానీ రాత్రిళ్లు ఒంటరిగా పడుకొని ఉన్నప్పుడు.. పదే పదే గుర్తుకు వచ్చి వేధించే రేసింగ్ థాట్స్ ఎవరికి తెలుస్తాయి? వాటికి మీరే టార్గెట్. కాబట్టి బుర్రతినేస్తాయి. అలాంటి అతి ఆలోచనలు తరచుగా రావడం ఓవర్ యాంగ్జైటీస్‌కు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.

కంఫర్ట్‌గా లేనప్పుడు

రాత్రిపూట మనసు ప్రశాంతంగా లేకపోవడం, శ్వాస సరిగ్గా తీసుకోలేని అసౌకర్యం, గుండె దడ, కండరాలపై ఒత్తిడి వంటివి కూడా ఆందోళనకు కారణం అవుతాయి. దీంతో నిద్రపట్టదు. అనుకోని సంఘటనలు, ఆపదలు, మనస్సును కలచివేసే ఘటనలు కూడా రాత్రిళ్లు ఆందోళనకు దారితీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

పరిష్కారం ఏమిటి?

నైట్ యాంగ్జైటీస్ ఎక్కువగా అతి ఆలోచనలు, నిద్రలేమి వల్ల వేధిస్తుంటాయి. ఇవి పరోక్షంగా ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంటాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. బాధాకరమైన, మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఆలోచనలు డైవర్ట్ చేసే వెదర్‌ను క్రియేట్ చేసుకోవాలి. బెడ్ రూమ్‌లో లేదా మీరు పడుకునే ప్లేస్‌లో మీకు హాయిగా అనిపించేలా ఉండాలి తప్ప గందరగోళ వాతావరణం ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రశాంగా నిద్రపడుతుంది. దీంతో అతి ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. అలాగే మీరు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటే కూడా ఆలోచనలు దానిచుట్టే తిరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రాబ్లంను ఎదుర్కొనే విషయంలో క్లారిటీ లేకపోవడం కూడా యాంగ్జైటీస్‌కు కారణం అవుతుంది. కాబట్టి అసలు ప్రాబ్లం ఏమిటి?, దానికి గల పరిష్కార మార్గాలేమిటి? అనేది నోట్ చేసుకుంటే మీకంటూ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

బుక్స్ చదవడం, నచ్చిన మ్యూజిక్‌ను ఆస్వాదించడం, ధ్యానం, మెడిటేషన్, వంటివి మానసిక ప్రశాంతకు దోహదం చేయడం ద్వారా రాత్రిళ్లు మానసిక ఆందోళన తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే లేట్‌గా భోజనం చేయడం, కాఫీ, టీ వంటి కెఫిన్ రిలేటెడ్ పానీయాలు తీసుకోకపోవడం, ధూమపానం, మద్య పానం వంటివి తగ్గించడం ద్వారా రాత్రిపూట ఆందోళనలను నివారించడంలో సహాయపడతాయని మానసిక నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story