Anti Aging Tips: మీ వయస్సును వెనక్కినెట్టే అద్భుతమైన ఆహారాలు.. ఇవి తీసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు!

by Javid Pasha |   ( Updated:2024-08-19 06:42:56.0  )
Anti Aging Tips: మీ వయస్సును వెనక్కినెట్టే అద్భుతమైన ఆహారాలు.. ఇవి తీసుకుంటే మరింత అందంగా కనిపిస్తారు!
X

దిశ, ఫీచర్స్ : ఏజ్ పెరిగినా తాము అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే బ్యూటీ క్రీములు వాడుతుంటారు. కానీ అవి తాత్కాలికమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాంటి వాటితో సంబంధం లేకుండానే మనం అందంగా కనిపించే సహజమైన మార్గం కేవలం సరైన ఆహారాలు మాత్రమే అంటున్నారు. దాదాపు అందం, ఆరోగ్యం అనేది తీసుకునే ఫుడ్స్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయని చెప్తున్నారు. ముఖ్యంగా కొల్లాజెన్ అనే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉంటే.. అందం పరంగా.. ఉన్న వయస్సుకన్నా ఐదారేండ్లు తక్కువ ఏజ్ కలిగిన వ్యక్తులుగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

కొల్లాజెన్ రిలేటెడ్ ఫుడ్స్

చర్మం నిగారింపునకు అవసరమైన కొల్లాజెన్ అనే హార్మోన్ శరీరంలో సహజంగానే ప్రొడ్యూస్ అవుతుంది. కానీ కొన్నిసార్లు అది తగినంతగా ఉత్పత్తి కాకపోవడంవల్ల ఏజింగ్ లక్షణాలు త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు కొల్లాజెన్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం ద్వారా చర్మం కాంతి వంతంగా మారడమే కాకుండా, వృద్ధాప్య ఛాయలు పోయి, యవ్వనంగా కనిపిస్తారని పోషకాహార నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా తృణ ధాన్యాలు, వివిధ బీన్స్, సోయాలో కొల్లాజెన్ తయారీకి అవసరమైన అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటితోపాటు విటమిన్ సి అధికంగా ఉండే అన్ని రకాల ఆహారాలు, పండ్లు కూడా కొల్లాజెన్ కంటెంట్ కలిగి ఉన్నందువల్ల ఏజింగ్ లక్షణాలను తగ్గించి అందాన్ని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు.

యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఆహారాలు

చర్మంలో మృత కణాలు రాకుండా అడ్డుకోవడం ద్వారా అందంగా కనిపించడంలో యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి. కాబట్టి అవి ఎక్కువగా ఉండే ఆహారాలు రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి ఎక్కువగా బీట్‌రూట్, టొమాటోలు, క్యారెట్లు, బెర్రీలు, కివి ఫ్రూట్‌లలో ఉంటాయి. తరచుగా తీసుకుంటూ ఉంటే చర్మంలో నిగారింపు పెరుగుతుంది. వీటితోపాటు అవకాడో, బొప్పాయి, జామ వంటి తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, గింజలు అన్ని రకాల పోషకాలతోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడంవల్ల చర్మంలో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఉన్న వయస్సుకంటే కూడా ఐదారేండ్లు తక్కువ ఏజ్ కలిగిన వ్యక్తులుగా కనిపించే చాన్స్ ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story