- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Animals: పెంపుడు జంతువులు నవ్వుతాయా?.. అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు!
దిశ, ఫీచర్స్ : జంతువుల్లో పైకి కనిపించే ఆకారం, ప్రవర్తన గురించి మనకు తెలిసినప్పటికీ వాటి మనస్తత్వం, ఫీలింగ్స్, మనుషులను, ఇతర పరిస్థితులను అర్థం చేసుకునే విధానం వంటి చాలా విషయాలు తెలియదు. అయితే వాటికి కూడా ప్రత్యేక లక్షణాలు, భావోద్వేగాలు ఉంటాయని ముఖ్యంగా ఆనందకర సమయాల్లో మనుషుల మాదరి నవ్వుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇటీవలి అధ్యయనాలు కూడా అదే పేర్కొంటున్నాయి.
శబ్దాలతో రియాక్ట్
ఎలుకలు, కుక్కలు, చింపాంజీలు, వివిధ జంతువులు సంతోషంగా ఉన్నప్పుడు ప్రత్యేకమైన శబ్దాలను చేస్తాయని, నవ్వుతాయని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ భావన కొత్తది కూడా కాదు.1872లో చార్లెస్ డార్విన్ ‘ది ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ మ్యాన్ అండ్ యానిమల్స్’లో కూడా జంతువుల ప్రవర్త, భావోద్వేగాల గురించి పేర్కొన్నాడు. చింపాంజీలు, కోతులు చకిలిగింతలకు రియాక్ట్ అవడం, మనుషుల నవ్వును గుర్తుచేసేలా శబ్దం చేయడాన్ని అతను ప్రస్తావించాడు. ఇటీవల జర్మనీలోని హన్నోవర్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనంలోనూ ఇది వెల్లడైంది.
కుక్కలు ఎలా నవ్వుతాయి?
కుక్కలు కూడా ఆనందం కలిగినప్పుడు నవ్వుతాయని, అందుకు ప్రత్యేక శబ్దం ఉంటుందని 2001లో యానిమల్ బిహేవియరిస్ట్ ప్యాట్రిసియా సిమోనెట్ గుర్తించారు. ఆటలు ఆడేటప్పుడు, ఆనందం కలిగినప్పుడు అవి ఎలా బిహేవ్ చేస్తాయని వారు పరిశీలించారు. అయితే బలంగా శ్వాస పీల్చడం, అరవడం, విలపించడం, మొరగడం వంటి శబ్దాలను కూడా అబ్జర్వ్ చేసిన నిపుణులు వీటితో పోల్చగా.. కుక్కలు నవ్వినప్పుడు ప్రత్యేకమైన స్పైనిక్ వాయిస్ వస్తుందని కనుగొన్నారు. ఇటీవలి కొందరు శాస్త్రవేత్తలు ఈ శబ్దాన్ని రికార్డు చేసి, వేరే కుక్కల ముందు ప్లే చేయగా అవి బొమ్మలు వెతకడం, ఆటలాడటం వంటి ప్రవర్తనను ప్రదర్శించాయట. దీంతో కుక్కల ఆనందం, ‘నవ్వు’ ప్రక్రియగా గుర్తించారు.
ఎలుకల్లో కిచ కిచలు
ఇక ఎలుకల్లోనూ ఆనందానికి సంబంధించిన భావోద్వేగాలు.. ముఖ్యంగా నవ్వులు ప్రత్యేక శబ్దాలుగా ఉంటాయి. బౌలింగ్ గ్రీన్ యూనివర్సిటీ న్యూరో సైంటిస్టుల ప్రకారం చిన్న ఎలుకలకు గిలిగింతలు పెడితే అవి కికిచ(చిర్ప్) సౌండ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ శబ్దాలు ఎలుకలు ఆడుకునే ప్రవర్తనతో, ఆనందంతో ముడిపడి ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు.
పరిశోధనలు ఏం చెప్తున్నాయి?
అనేక జంతువులు ఆనందకర సమయంలో భావోద్వేగాలను లేదా భావాలను శబ్దాల రూపంలో, ప్రవర్తనలో వ్యక్తం చేస్తుంటాయి. అయితే ఎలుకలు, కుక్కల్లో మాత్రం వాటిని నవ్వులుగా పేర్కొంటున్న రీసెర్చర్స్ ఇతర జంతువుల్లో ఫలానా శబ్దం మాత్రమే వాటి ‘నవ్వు’ అనే విషయాన్ని ఇంకా కనుగొనలేదు. చింపాంజీలు, కోతులు, కుక్కలు, పిల్లులు ఆనందకరమైన వేళల్లో ప్రత్యేక శబ్దాలు చేస్తాయని, అదే వాటి నవ్వు అయినప్పటికీ దీనిని మానవ కోణంలో ‘నవ్వు’గా ఇంకా నిర్ధారించలేదని యూనివర్సిటీ ఆఫ్ అపోర్ట్స్ మౌత్‌కు చెందిన రీసెర్చర్స్ పేర్కొంటున్నారు.