Anant Ambani: హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న కొత్త దంపతులు.. మనసు గెలుచుకున్న అనంత్ అంబానీ(వీడియో)

by Anjali |
Anant Ambani: హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న కొత్త దంపతులు.. మనసు గెలుచుకున్న అనంత్ అంబానీ(వీడియో)
X

దిశ, ఫీచర్స్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తక్కువ స్థాయి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు అనేక కంపెనీలు స్థాపించారు. లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఆదుకునే రేంజ్‌కు వెళ్లారు. అంబానీ ఫ్యామిలీ 27 ఫ్లోర్స్ కలిగున్న భవనంలో నివసిస్తుండటం విశేషం. ఈ ఆంటీలయా భవనం మొత్తం ప్రతి నెలా 6,37,240 యూనిట్ల కరెంట్ వినియోగిస్తోంది. దేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ ఇటీవలే తన చిన్న కుమారుడి పెళ్లి చరిత్రలో నిలిచిపోయేలా చేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది రిచ్ పర్సన్స్ తమ స్టేటస్‌ను చూపించుకోవాలని చూస్తున్నారు. కానీ అంబానీ ఫ్యామిలీ ఆ యాటిట్యూట్ చూపించదని చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోసారి నిరూపించాడు.

జులై 12 వ తేదీన గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్న అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవ్వగా.. అందులో అనంత్ అంబానీ కారు దిగి వస్తుండగా అభిమానులు ఎదురుగా వచ్చారు. దీంతో అనంత్ ఏ మాత్రం పొగరు చూపించకుండా నవ్వుతూ పలకరించాడు. పలువురు ఫ్యాన్స్ ఏకంగా అనంత్ అంబానీ భుజంపై చేయి వేసి మరీ సెల్షీ తీసుకున్నారు.

సెక్యూరిటీ అనంత్ దగ్గరకు రాకుండా ఆపినా.. ఆయన మాత్రం ఎలాంటి యాటిట్యూడ్ చూపించకుండా వారితో ఫొటో దిగడానికి అంగీకరించాడు. ‘మీరు ఫ్రెంచ్ మాట్లాడుతారా? అని అనంత్ ను అడిగారు. దీంతో లేదు మాట్లడను అని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. బోంజర్ అని ఫ్యాన్స్‌కు స్వాగతం పలికారు’. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు అనంత్ అంబానీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story