Aliens : అంతరిక్షంలో వింత సిగ్నల్స్.. ఏలియన్స్ పనేనా?

by Javid Pasha |
Aliens : అంతరిక్షంలో వింత సిగ్నల్స్.. ఏలియన్స్ పనేనా?
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలో అంతుపట్టని రహస్యాల ఛేదనకోసం నిరంతర పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాల గురించి ఇప్పటికే అనేక అంశాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయినా మానవుడి ఊహకు అందని అంతరిక్ష వింతలు ఇంకెన్నో ఉన్నాయి. ముఖ్యంగా గ్రహాంతర వాసుల ఉనికిపై దశాబ్దాల కాలంగా క్యూరియాసిటీ నెలకొన్నప్పటికీ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. తాజాగా మరోసారి ఏలియన్ గురించి డిస్కషన్ నడుస్తోంది.

ఇంతకు ముందెన్నడూలేని విధంగా అంతరిక్షం నుంచి ఏవో అసాధారణమైన రేడియో సిగ్నల్స్ వచ్చినట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. పైగా ఈ సిగ్నల్స్ గంటకు‌పైగా ఉన్నాయని, ఇప్పటి వరకు ఇదే లాంగెస్ట్ సిగ్నల్ అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్య పర్చినప్పటికీ ఈ సిగ్నల్స్ ఎలా వచ్చాయన్నది మాత్రం సైంటిస్టులు ఇంకా కనుగొనలేదు. కాకపోతే ఇది ఏలియన్స్ పనే అయ్యుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతరిక్షంలో కనిపించిన వింత సిగ్నల్స్‌ కొన్నిసార్లు లాంగ్‌ ట్యూన్‌ను పోలి ఉంటాయని, మరి కొన్నిసార్లు బ్రైట్‌ ఫ్లాష్‌గా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తమ నివేదికలో పేర్కొ్న్నారు. మొదటి దశలో తాము 10 నుంచి 50 సెకన్ల వరకు ఉండే బ్రైట్‌, లీనియర్లీ పోలరైజ్డ్‌ పల్సెస్‌‌ను చూసినట్లు వెల్లడించారు. ఇవి దాదాపు 370 మి.సెకన్ల వరకు కొనసాగాయని మూడో స్టేజ్‌లో ఎలాంటి పల్సెస్ కనిపించలేదని, నిశ్శబ్దంగా లేదా చల్లారిపోయిన స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అయితే న్యూట్రాన్ స్టార్స్ విషయంలోనూ ఇటువంటి వింత సిగ్నల్స్ వచ్చే చాన్సెస్ ఉన్నప్పటికీ అవి అంతసేపు ఉండవు. కాబట్టి తాజా పరిస్థితికి అసలు కారణం ఏంటనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed