LPG Cylinder కస్టమర్లకు అలెర్ట్..! జూన్ 1 నుంచి కొత్త రూల్స్ షురూ..

by Kavitha |
LPG Cylinder కస్టమర్లకు అలెర్ట్..! జూన్ 1 నుంచి కొత్త రూల్స్ షురూ..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా కొత్త నెల రాగానే కొత్త రూల్స్ అనేది అమలులోకి వస్తుంటాయి. అదే విధంగా ఈ జూన్ 1 నుండి కూడా కొత్త రూల్స్ అమలులోకి రానున్నది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం..

కామన్‌గా చమురు కంపెనీలు ప్రతినెల LPG సిలిండర్ ధరల్ని సవరిస్తారనే విషయం తెలిసిందే. కాగా ఫైనల్‌గా ఎన్నో కారణాల వలన తగ్గటం లేక పెంచడం చూస్తుంటాం. అయితే దేశంలో LPG సిలిండర్ కస్టమర్లకు ధరలు పెరిగినప్పుడు ప్రయోజనం చేకూర్చాలి అనే ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అమలు చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈ నెల జూన్ 01 నుంచి కొత్త నిబంధనలు అనేవి అమల్లోకి వస్తుండగా, LPG సిలిండర్ కస్టమర్లు కొత్త నవీకరణలను పొందడానికి ఏం చేయాలో తెలుసుకుందాం…

ఉజ్వల పథకం కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తున్నాయి. అయితే ఈ పథకం క్రింద LPG గ్యాస్ సిలిండర్లు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీ ఇస్తుంది. అయితే ఎన్నికలు సమయం కాబట్టి KYC ని ఖచ్చితంగా పొందాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

LPG Cylinder సబ్సిడీ పెంపు:

ఎన్నికల తర్వాత LPG సిలిండర్ రూ.903 లభిస్తుండగా ప్రస్తుతం రూ.600 అందుబాటులోకి వస్తున్నది. అనగా సబ్సిడీ రేటు రూ.300 నుంచి రూ.600 కు పెరగవచ్చు. అందువలన ప్రతి LPG గ్యాస్ సిలిండర్ కస్టమర్లు KYC ని పొందేందుకు లేదా మీ సిలిండర్ e- KYC కాదా అని తెలుసుకునేందుకు దగ్గర లో ఉన్న గ్యాస్ ఆఫీసు కి కాల్ చేసి ఈరోజే e- KYC ని పూర్తి చెయ్యండి. లేకుంటే సబ్సిడీ పొందలేరు. ప్రతి గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు ఇది తప్పనిసరి.

Advertisement

Next Story