- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల, మెడ క్యాన్సర్లకు సరికొత్త ట్రీట్‌మెంట్.. అందుబాటులోకి న్యూ రేడియేషన్ థెరపీ
దిశ, ఫీచర్స్: రేడియేషన్ థెరపీలు ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, తల, మెడ వంటి సున్నితమైన ప్రాంతాల్లో వాటి పనితీరు అంత సమర్థవంతంగా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త రేడియేషన్ థెరపీ ఐఎంఆర్‌టీతో (Intensity-modulated radiation therapy) ఆ పరిస్థితి పోతుందని వైద్య నిపుణులు నమ్ముతున్నారు. తల, మెడ, గొంతు భాగంలోని అతిచిన్న క్యాన్సర్ కణాలను కూడా ఈ అధునాతన ఐఎంఆర్‌టీ రేడియేషన్ కిరణాల ప్రయోగం ద్వారా సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయవచ్చని చెప్తున్నారు.
ఎందుకంటే న్యూ రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ గడ్డల షేప్‌కు సరిపోయేలా ఆకారంలో ఫోకస్ చేసేందుకు అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. కొన్ని రకాల క్యాన్సర్లు సాధారణంగా నోరు, గొంతు లేదా వాయిస్ బాక్స్‌లో ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడవ అత్యంత సాధారణ క్యాన్సర్లలో తల, మెడ క్యాన్సర్లు ఉన్నాయి. ఇక భారతదేశంలో అయితే ఇవి రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్లుగా ఉన్నాయి. పెదవులు, నోటి కుహరం క్యాన్సర్లు కూడా ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి.
కొత్త రేడియేషన్ థెరపీ అనేది శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కడున్నా కచ్చితంగా పనిచేయగల లక్ష్యంతో కూడిన చికిత్స. అంతేగాక బాడీలోని ఇతర ఆరోగ్యకరమైన అవయవాలు, కణజాలాలను కాపాడుతూ క్యాన్సర్ కణాలను మాత్రమే చంపడానికి లేదా వాటి సంఖ్యను తగ్గించడానికి సహాయపడుతుంది. పైగా ఇది ఔట్ పేషెంట్ ట్రీట్‌మెంట్ విధానంలో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ప్రయోజనం పొందగలిగే చికిత్స అంటున్నారు వైద్య నిపుణులు.