అలా చేయ‌డం దారుణ‌మైన హింస కిందకే వ‌స్తుంది!

by Sumithra |
అలా చేయ‌డం దారుణ‌మైన హింస కిందకే వ‌స్తుంది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః వాగ్వివాదం ఎలాంటిదైనా అందులో బెదిరింపులు ఉంటాయి. ఇంగ్లీష్‌లో బుల్లీయింగ్ అని పిలిచే ఈ బెదిరింపు సంకేతాలు లేదంటే కించపరిచే వ్యాఖ్యలు వంటి చ‌ర్య‌లపై ఇటీవ‌ల ఓ అధ్య‌య‌నం ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. ముఖ్యంగా, స్కూలు పిల్ల‌ల్లో అత్యంత సాధార‌ణంగా క‌నిపించే ఈ బెదిరింపుల్లో ఒక పిల్లాడిని సామాజికంగా, లేదంటే సమూహ కార్యకలాపాల నుండి మినహాయించడం, త‌న‌పై తప్పుడు పుకార్లను వ్యాప్తి చేయడం వంటి అంశాలు బాధితులపై ప్రతికూల సామాజిక, భావోద్వేగ ప్రభావాలను క‌లిగిస్తుంద‌ని, అది నిస్సంకోచంగా హింసేన‌ని అధ్య‌య‌నం పేర్కొంది.

పాఠశాలల్లో బుల్లీయింగ్ మ‌రింత ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని తెలిసింది. తోటి విద్యార్థుల చూపించే వివ‌క్ష‌, సామాజిక కార్యకలాపాల నుండి పిల్లలను మినహాయించడం అనే చ‌ర్య‌లు, పిల్ల‌వాడిని గుద్దడం, కొట్టడం, తన్నడం వంటి చ‌ర్య‌ల‌తో క‌లిగే స్వల్ప, దీర్ఘకాలిక ప్రభావాల వంటి ప్ర‌భావాన్నే కలిగిస్తుందని గ‌తంలో అధ్యయనాలు వెల్ల‌డించ‌గా, మిస్సౌరీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ చాడ్ రోస్ వివ‌ర‌ణ‌ను బ‌ట్టి, ఈ అధ్యయనం విద్యార్థులు తరచుగా ఎదుర్కొనే సోష‌ల్ ఎక్స్‌క్లూజ‌న్‌పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా, పిల్లలు వారి సహవిద్యార్థులచే తిరస్కర‌ణ‌కు గురైన‌ప్పుడు అది మ‌రింత ఆందోళనకరంగా ఉంటుందని ఇందులో వెల్ల‌డించారు. ఇలా బుల్లీయింగ్‌కి గురైన బాధిత పిల్ల‌లు పెద్ద‌వారైన త‌ర్వాత మ‌రింత హింసాత్మ‌కంగా మారే అవ‌కాశ‌ముంద‌ని స్ట‌డీలో చెప్పిన‌ట్లు ది ప్రింట్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed