ఉద్యోగుల భద్రతకు కంపెనీ ఏం చేయాలి?

by Sujitha Rachapalli |   ( Updated:2024-10-03 16:24:16.0  )
ఉద్యోగుల భద్రతకు కంపెనీ ఏం చేయాలి?
X

దిశ, ఫీచర్స్ : విజయవంతమైన సంస్థను నడపడం వన్ మ్యాన్ షో కాదు. అక్కడ పని చేస్తున్న ఉంద్యోగులందరి ఎఫర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వర్క్ ప్లేస్ ఎంప్లాయీస్ కు సానుకూల శక్తితో ఉల్లాసం కలిగించేదిగా ఉండాలి. నెక్స్ట్ డే వర్క్ కోసం ఎదురుచూసేంత ఉత్సాహాన్ని అందించాలి. సంస్థకు చెందిన లీడర్స్ ఉద్యోగులను ప్రేరేపించే విధానం కొనసాగాలి. వ్యాపార లక్ష్యాలు, విలువలకు దీర్ఘకాలిక నిబద్ధతతో ఉండేలా చేస్తుంది. వృద్ధికి బాటలు వేసేలా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ వర్క్ ప్లేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

వర్క్ ప్లేస్ కల్చర్ ఉద్యోగుల శ్రేయస్సు, మానసిక భద్రతకు స్థలాన్ని సృష్టిస్తుంది. విధానాలు, నాయకత్వం, కంపెనీ విలువలకు కట్టుబడి వారిలోని బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు అధికారం ఇస్తుంది. వ్యాపారస్తులు ఈక్విటీ, సహకారం, విశ్వాసం పెంపొందించుకోవాలి. ఉద్యోగులు రిస్క్ తీసుకుని సరికొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహించాలి. వారి వ్యక్తిగత అభివృద్ధి, భద్రత కోసం సంస్థ ఉందనే భరోసా ఇవ్వాలి. అభిప్రాయాలను గౌరవించాలి. విజయాలను నిరంతరం గుర్తించాలి.

ఉద్యోగి అవసరాలపై విశ్లేషణ

ఏదైనా వ్యాపారంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే.. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో స్పష్టంగా అంచనా వేయాలి. అప్పుడే సానుకూల పని వాతావరణాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందుకు సాగుతారు. సంస్థకు చెందిన లీడర్స్ ప్రస్తుత పని తీరు, ప్రవర్తనలు, విలువలు, లక్ష్యాలు, పని విధానాలలో లోపాలు వెతకాలి. ఇలా చేస్తేనే మరింత ప్రభావవంతమైన పని విధానాలను క్రియేట్ చేయగలరు.

మేనేజర్లకు శిక్షణ

ఆఫీసులో పాజిటివ్ అట్మాస్పియర్ క్రియేట్ చేయడంలో మేనేజర్లు అందరూ తమ వంతు పాత్ర పోషించాలి. ప్రొడక్టివిటీని గణనీయంగా పెంచే, సహకారాన్ని ప్రోత్సహించే టీమ్-బిల్డింగ్ ఈవెంట్స్ లో క్రమం తప్పకుండా పాల్గొనాలి. అప్పుడే ఉద్యోగులు సంస్థను సొంతంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీని ఉన్నతంగా నిలబెట్టేందుకు మెరుగ్గా పని చేయగలుగుతారు. అంతేకాదు మేనేజర్లు ప్రతి విషయంలో అవగాహన కల్పించేలా, దయగా ఉండాలి. అప్పుడు ఉద్యోగులు అవసరమైనప్పుడు వారిని సంప్రదించడానికి సంకోచించరు.

వ్యక్తిగత స్థాయిలో మార్పులు

చిన్న చిన్న మార్పులే కంపెనీ వాతావరణంలో గొప్ప మార్పులకు దారితీస్తాయి. ఉద్యోగుల ప్రవర్తనలో చేంజ్ తీసుకొచ్చేందుకు వ్యక్తిగత స్థాయిలో పనిచేయాలి. ఒపీనియన్ మీటింగ్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయడం.. ఉద్యోగుల కష్టాలను గుర్తించడంలో, పరిష్కరించడంలో హెల్ప్ చేస్తుంది. అప్పుడు ఎంప్లాయీస్ కంపెనీకి కట్టుబడి కృతజ్ఞతతో వర్క్ చేయగలరు.

నిరంతర మద్దతు

ఉద్యోగులు మేనేజర్‌లతో తరచుగా కమ్యూనికేట్ అయ్యే వర్క్ పాటర్న్ ను కంపెనీ ప్రోత్సహించాలి. రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, సపోర్ట్ ఉండేలా చూడాలి. అప్పుడు ఉద్యోగులు సరైన మార్గంలో ఉన్నారా లేదా తెలుస్తుంది. కంపెనీ లక్ష్యాల కోసం ఎంతగా కష్టపడుతున్నారనేది తెలియడంతో పాటు ఉద్యోగికి కూడా మద్దతు లభిస్తుందనే సంతృప్తి ఉంటుంది.

అభిప్రాయ వ్యక్తీకరణ

ఉద్యోగులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగేలా సంస్థ ప్రోత్సహించాలి. అలాంటి సౌకర్యవంతమైన సెట్టింగ్.. తమ ఉద్యోగం గురించి ఎలాంటి భయం లేకుండా తమ ఒపీనియన్ చెప్పవచ్చని భావించేలా చేస్తుంది. ఈ పద్ధతి కంపెనీకి దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. టీం మెంబర్స్, మేనేజర్ల మధ్య మెరుగైన సామాజిక సంబంధాలను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది.

సంతోషం ముఖ్యం

ఉద్యోగుల సంతోషం కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుందని మరిచిపోవద్దు. వారిని అర్థం చేసుకుని.. టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్ లేకుండా చూసుకుంటే మరింత కమిట్మెంట్ తో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపుతారు. కంపెనీ మెరుగైన పనితీరుకు కారణం అవుతారు.

మంచి పనికి గుర్తింపు

మంచి ఫీడ్‌బ్యాక్‌తో ఉద్యోగులను అభినందించడం, గుర్తించడం అనేది పాజిటివ్ వర్క్ కల్చర్ కు అత్యవసరం. బాగా వర్క్ చేసిన వారికి మీటింగ్స్ లో స్పెషల్ అప్రిసియేషన్ అందించడం, రివార్డ్ సిస్టమ్‌ను క్రియేట్ చేయడం ద్వారా ప్రోత్సహించడం కంపెనీ లాభాల బాటలో నడిచేలా చేస్తుంది.

బలం, బలహీనతలను గుర్తించడం

ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని కంపెనీ గుర్తించాలి. ప్రతి ఒక్కరూ వారి భావోద్వేగ అవసరాలు, వ్యక్తిత్వ రకం, బలాలు, పరిమితుల పరంగా భిన్నంగా ఉంటారు. ఇందుకు తగిన విధంగా విధులు అప్పగించడం మంచిది. మెరుగ్గా పని చేయడానికి, ఒక వ్యక్తికి మరింత కృతజ్ఞత అవసరం కావచ్చు, అది కంపెనీ అందించినట్లు అవుతుంది. ఫలితంగా వారు మరింత ఉత్పాదకతతో పని చేసేందుకు ముందుంటారు.

Advertisement

Next Story

Most Viewed