అతడిని పెళ్లి చేసుకొని నాతో సెక్స్ చేస్తదట.. ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు

by Nagaya |   ( Updated:2023-05-25 15:31:48.0  )
అతడిని పెళ్లి చేసుకొని నాతో సెక్స్ చేస్తదట.. ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి రోజుల్లో పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు. చదువులు, ఉద్యోగాలు అని తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నచ్చిన వారితో కలిసి కాపురం చేస్తున్నారు. ఈ తర్వాత ఇష్టం ఉంటే పెళ్లి.. లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. నేటి యువతకు ఇది సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఇద్దరు ఏకాభిప్రాయంతో విడిపోతే సమస్య లేదు కానీ ఆ జంటలో ఏ ఒక్కరూ గాడంగా ప్రేమించినా.. మరొకరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ జంట చేసిన పని వార్తల్లో నిలిచింది.

అమలాపురానికి చెందిన శివ, గుంటూరుకు చెందిన యువతి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిగురించిన స్నేహం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు కలిసి ఓ ప్లాట్ అద్దెకు తీసుకుని గుట్టుగా సహజీవనం చేస్తున్నారు. కాగా, యువతి తల్లిదండ్రులు ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధాలు చూశారు. అయితే తను ఓ యువకుడిని ఇష్టపడుతున్నానని తల్లిదండ్రులకు చెప్పింది. దానికి వాళ్లు అంగీకరించపోగా.. తాము చూసిన యువకుడిని వివాహం చేసుకోకపోతే కుటుంబం మొత్తం చనిపోతామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో బెదిరిపోయిన యువతి ఆ పెళ్లికి ఓకే చెప్పింది. మరోవైపు కాబోయే భర్త కూడా ఉన్నత ఉద్యోగంలో ఉండటం.. అధిక మొత్తం శాలరీ ఉండటంతో కాదనలేకపోయింది.

ఇదే విషయాన్ని శివకు చెప్పింది. తాను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని, కానీ మన రిలేషన్ షిప్ ఇలాగే కొనసాగుతుందని, నీకు నచ్చినప్పుడల్లా వచ్చి శృంగారం చేస్తానని చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్న ప్రియుడు మొదట షాక్‌కు గురయ్యాడు. ఆమెకు నచ్చజెప్పాలని చూసినా ఆమె వినకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు. అతడిని పెళ్లి చేసుకోని నాతో సెక్స్ చేయడం అంటే భర్తను మోసం చేయడమేనని చెప్పినా.. ఆ యువతి మాత్రం నిన్ను వదులుకోను.. అతడిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను అని మొండిగా వాదనకు దిగింది. దీంతో మెంటల్‌గా శివ బాగ దెబ్బతిని ఆస్పత్రి పాలయ్యాడు. విషయం తెలుసుకున్న శివ తల్లిదండ్రులు కుమారుడిని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ ఇప్పిస్తూ కొడుకు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు.

Also Read..

అబ్బాయిలతో రిలేషన్ షిప్ పెట్టుకుంటున్నారా..? అమ్మాయిలు తప్పక తెలుసుకోవాల్సింది ఇదే..!

Advertisement

Next Story