- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆఫీస్ కొలీగ్స్ పెళ్లికి రాలేదని జాబ్ రిజైన్ చేసిన మహిళ
దిశ, ఫీచర్స్ : ఎవరైనా గానీ బలమైన కారణముంటే తప్ప తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయరు. విషపూరితమైన పని వాతావరణం, దీర్ఘకాలికంగా పనిచేస్తు్న్నప్పటికీ సరైన గ్రోత్ లేకపోవడం వంటివి మచ్చుకు కొన్ని కారణాలు. కానీ చైనాలోని ఓ మహిళ మాత్రం విచిత్రమైన కారణంతో తన ఉద్యోగాన్ని వదులుకుంది. సోహులోని ఒక నివేదిక ప్రకారం, సదరు మహిళ తన వివాహానికి 70 మంది సహోద్యోగులను ఆహ్వానించగా.. ఒక్కరు మాత్రమే హాజరవడంతో నిరాశచెంది ఉద్యోగానికి రాజీనామా చేసింది.
పెళ్లి రోజున ఆఫీస్ కొలీగ్స్‌లో మూడింట ఒక వంతు మందికి రిమైండర్స్ కూడా ఇచ్చినట్లు చైనా మహిళ పేర్కొంది. పైగా కొలీగ్స్‌లో కొందరిని మాత్రమే ఆహ్వానిస్తే మిగతా వారు కలత చెందుతారని భావించి మొత్తం 70 మంది సహోద్యోగులకు వివాహానికి రెండు నెలల ముందుగానే ఆహ్వానం పంపింది. కానీ ఆహ్వానించబడిన 70 మందిలో తన పెళ్లి రోజున ఒక్కరు మాత్రమే కనిపించేసరికి ఖంగుతింది. దీంతో ఆరు టేబుళ్లకు సరిపడా ఆహారం వేస్ట్ అయిపోయిందని, కుటుంబం ముందు కూడా అవమానానికి గురైనట్లు తెలిపింది. ఇదే కారణంతో చాలా ఇబ్బందిపడిన ఆమె మరుసటి రోజు ఉద్యోగం మానేసింది.