Weight loss (Viral Video): వామ్మో.. రోజూ ఆ పని చేస్తూ.. 15 కిలోల బరువు తగ్గిందిగా!!

by Javid Pasha |
Weight loss (Viral Video): వామ్మో.. రోజూ ఆ పని చేస్తూ..  15 కిలోల బరువు తగ్గిందిగా!!
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. నిశ్చల జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు, జెనెటిక్ హెల్త్ హిస్టరీ.. వంటివి ఇందుకు కారణం అవుతున్నాయి. డయాబెటిస్, స్ట్రోక్, హార్ట్‌ ఎటాక్ వంటి సమస్యలు కూడా ఓవర్ వెయిట్‌తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలని నిపుణులు సూచిస్తుంటారు. బాధితులు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాగా వెయిట్ లాస్ జర్నీ అందరి విషయంలో ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిలో ప్రయత్నం చేస్తుంటారు. ఓ మహిళ కూడా అదే చేసింది. ఏకంగా 75 కిలోల 60 కిలోలకు తగ్గిన ఆమె అది ఎలా సాధ్యమైందో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.

* తన వెయిట్ లాస్ జర్నీలో సక్సెస్ అయ్యానని పేర్కొన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ భవ్య ఏకంగా 15 కిలోల బరువును తగ్గడం ఎలా సాధ్యమైందో ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఫ్యాట్ లాస్ కోసం తాను తీసుకున్న ఫుడ్ గురించి, చేసిన వ్యాయామాల గురించి వెల్లడించింది. బరువు తగ్గడానికి ఏం చేయాలో తన ఫాలోవర్లకు వివరించింది.

* పండ్లు, కూరగాయలు : అధిక బరువు తగ్గడంలో ఆహార నియామాలు కూడా కీ రోల్ పోషిస్తాయి. కాబట్టి మీ రోజువారీ డైట్‌లో రంగు రంగుల పండ్లు, కూరగాయలను చేర్చండి. ఎందుకంటే అవి తక్కువ కేలరీలు కలిగి, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి.

* లీన్ ప్రొటీన్లు : వెయిట్‌లాస్ అవ్వడంలో లీన్ ప్రొటీన్లు చాలా ముఖ్యం. మీ భోజనంలో చికెన్, చేపలు, కాయ ధాన్యాలు లేదా టోఫుని చేర్చండి. ప్రొటీన్‌లు ఎనర్జీతోపాటు మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో, బాడీ మాస్ ఇండెక్స్‌ను మేనేజ్ చేయడంలో సహాయపడతాయి.

*తృణ ధాన్యాలు : బియ్యం, క్వినోవా లేదా ఓట్స్ డైట్‌లో తప్పక చేర్చండి. ఈ కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్లు అధిక శక్తిని ఇవ్వడంతోపాటు ఎక్కువసేపు కడుపు నిండిన అనూభూతిని కలిగిస్తాయి. తద్వారా వెయిట్‌లాస్ ఈజీ అవుతుంది.

* వార్మ్ - అప్ : 5 నుంచి 10 నిమిషాల లైట్ కార్డియోతో మీ వ్యాయామాన్ని ప్రారంభించండి. జాగింగ్ లేదా డైనమిక్ స్ట్రెచ్‌లు ప్రయత్నించండి. క్రమంగా ఇవి మీ శరీరాన్ని బలంగా తయారు చేయడంతోపాటు మరిన్ని వ్యాయామాల కోసం సిద్ధం చేస్తాయి. గాయాలను నివారించడంలో సహాయపడతాయి.

*స్ట్రెంత్ ట్రైనింగ్ : పుష్ - అప్స్, స్క్వాట్స్ అండ్ లంగ్స్ వంటి శరీర బరువును తగ్గించే వ్యాయామాలపై ఎక్కువ ఫోకస్ చేయండి. అందుబాటులో ఉండే డంబెల్స్‌ను కూడా మీరు ఉపయోగించవచ్చు. డైలీ 30 నుంచి 40 నిమిషాలు ఇలా పుష్ - అప్స్, బరువులు ఎత్తడం వంటివి చేస్తే బరువు తగ్గుతారు.

* కార్డియో : మీ శరీరానికి స్ట్రెంత్ ట్రైనింగ్ ముఖ్యం. సో.. 30 నిమిషాల వాకింగ్ లేదా రన్నింగ్ చేయండి. ఇది కేలరీలను బర్న్ చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా కార్డియో వాస్క్యులర్ ఫిట్‌నెస్‌ను మెరుగు పరుస్తుంది.

*ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెచింగ్ : వ్యాయామం తర్వాత అలసటను మేనేజ్ చేయడానికి, శక్తి నిర్వహణకు మీ బాడీని కొంత సాగదీయడం లేదా యోగా వంటివి చేయండి.

* హైడ్రేషన్ : అధిక బరువు తగ్గాలంటే వ్యాయామాలే కాదు, మీరు ఆరోగ్యంగానూ ఉండాలి. కాబట్టి మీరు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. అందుకోసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. హైట్రేటెడ్‌గా ఉండటం అనేది మీ జీవక్రియకు, జీర్ణ క్రియకు కూడా సహాయపడుతుంది.

*భోజన సమయం : మీ ఎనర్జీ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచుకోవాలంటే సరైన భోజన నియమం అవసరం. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అది కూడా ఒకేసారి ఎక్కువగా తినవద్దు. కొద్ది కొద్దిగా తినండి. ముఖ్యంగా బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ వంటివి మాత్రం దాటవేయకండి. కాకపోతే పద్ధతి ప్రకారం పోషకాలతో కూడిన హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి.

Video credits ot avgeek.bhavya insta handle

Next Story