అలాంటి ఆలోచనలు వేధిస్తున్నాయా?.. త్వరగా చనిపోవచ్చు కూడా !

by Javid Pasha |   ( Updated:2024-01-01 07:44:56.0  )
అలాంటి ఆలోచనలు వేధిస్తున్నాయా?.. త్వరగా చనిపోవచ్చు కూడా !
X

దిశ, ఫీచర్స్ : ఉన్నట్టుండి లేనిపోని ఆలోచనలు వేధిస్తున్నాయా? ప్రతి విషయానికీ ఆందోళన చెందుతున్నారా? ఇది సహజమైన ప్రవర్తనలో భాగమైతే నో ప్రాబ్లం. కానీ తరచూ అదొక వ్యసనంలాగా వెంటాడుతుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఎందుకంటే అది యాంగ్జైటీ డిజార్డర్ లేదా ఇల్‌నెస్ డిజార్డర్ అనే తీవ్రమైన మానసిక రుగ్మత కావచ్చు. దీనివల్ల బాధితుల్లో లేనిపోని అనుమానాలు తలెత్తుతుంటాయి. తమకు ఏదో జరుగుతుందని భయపడుతుంటారు. ఎటువంటి అనారోగ్యం లేకపోయినా ఏదో ఒక భయంకర వ్యాధి వచ్చినట్లు ఊహించుకొని ఇబ్బంది పడుతుంటారు. ప్రతీక్షణం కుమిలిపోతుంటారు. కొందరు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తుంటారు.

అయితే అతి ఆలోచనలు, అతి ఆందోళనవల్ల ఆకలి మందగించడం, జీవక్రియలకు ఆటంకం కలగడంవల్ల నిజంగానే బాధితుల్లో కొన్నాళ్లకు అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయని, త్వరగా మరణం సంభవించే అవకాశం ఉంటుందని స్వీడన్‌కు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్టడీలో భాగంగా రీసెర్చర్స్ 20 ఏండ్లు పైబడిన 42 వేలమందిని 16 ఏండ్లపాటు పరిశీలించారు. తమకు ఏమీ కాకపోయినా ఏదో జరుగుతుందని భయపడటం, ఎటువంటి అనారోగ్యం లేకపోయినా ఏదో ఒక వ్యాధి వచ్చిందని ఊహించుకోవడం వంటి దారితప్పిన అతి ఆలోచనలు, ఆందోళనలు వ్యసనంగా మారినవారు మిగతా వారితో పోల్చితే 40 నుంచి 45 ఏండ్లలోపు మరణించే అవకాశం ఐదురెట్లు పెరిగినట్లు గుర్తించారు. కాబట్టి ఇల్‌నెస్ డిజార్డర్ లేదా యాంగ్జైటీ డిజార్డర్ వంటి రుగ్మతలు తలెత్తితే ముందుగానే అప్రమత్తమై తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Read More..

న్యూ ఇయర్‌ వేళ కండోమ్ ఆర్డర్ల మోత.. గంటకు ఎన్ని సేల్ అయ్యాయో తెలుసా..?

Advertisement

Next Story

Most Viewed