ఓల్డేజ్‌‌లో లెర్నింగ్‌‌ యాక్టివిటీస్.. జీవన ప్రమాణాన్ని 19 శాతం పెంచుతాయట

by Prasanna |   ( Updated:2023-08-26 08:19:28.0  )
ఓల్డేజ్‌‌లో లెర్నింగ్‌‌ యాక్టివిటీస్.. జీవన ప్రమాణాన్ని 19 శాతం పెంచుతాయట
X

దిశ, ఫీచర్స్ : ఓల్డేజ్‌లో వివిధ మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు సహజంగానే వెంటాడుతుంటాయి. వీటివల్ల సదరు వ్యక్తులు ఎక్కువకాలం జీవించే అవకాశాలు తగ్గుతుంటాయి. కొందరు జ్ఞాపశక్తి కోల్పోతుంటారు. చాలామందిని డిమెన్షియా ఇబ్బంది పెడుతుంది. కానీ వివిధ బ్రెయిన్ టీజర్స్, పజిల్స్, వీడియోగేమ్స్ వంటివి ఆడటం.. అడల్ట్స్ ఎడ్యుకేషన్ క్లాస్‌లకు వెళ్లడం వంటి యాక్టవిటీస్ ఈ పరిస్థితిని దూరం చేస్తాయని, పైగా ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయని తోహోకు యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్, ఏజింగ్ అండ్ క్యాన్సర్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. పైగా బాధితులైన వ్యక్తులు కూడా అడల్ట్ ఎడ్యుకేషన్ క్లాసెస్ తీసుకోవడంవల్ల ఐదేళ్లలో డిమెన్షియా రిస్క్ నుంచి పూర్తిగా బయటపడతారట.

అధ్యయనంలో భాగంగా సైంటిస్టులు యూకే బయోబ్యాంక్ ద్వారా సేకరించిన మొత్తం 282,421 మంది డేటాను విశ్లేషించారు. అయితే ఇందులో 2006 నుంచి 2010 వరకు 40 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్సుగల వారు వయోజన విద్యకు సంబంధించిన తరగతులకు హాజరుకావడం వల్ల యాక్టివ్‌గా ఉన్నారని గుర్తించారు. అయితే వీరితో పోల్చడానికి ఎటువంటి మైండ్ పజిల్స్ యాక్టివిటీస్ లేని ఇతరులను కూడా ఏడేళ్లపాటు అబ్జర్వ్ చేసి, వైద్య పరమైన టెస్టులను నిర్వహించారు. రెండు గ్రూపులకు సంబంధించిన వ్యక్తుల డీఎన్ఏలో సింగిల్-లోకస్ పాలిమార్ఫిజమ్స్ వద్ద ప్రతీ వ్యక్తి జన్యురూపం ఆధారంగా వారి ఆయు ప్రమాణాన్ని లెక్కించారు. అడల్ట్స్ ఎడ్యుకేషన్ క్లాస్‌లకు హాజరవడం, మైండ్ పజిల్స్, క్రియేటివ్ రైటింగ్స్ వంటి యాక్టివిటీస్‌ కలిగిన వారు, ఇతరులతో పోల్చితే 19 శాతం ఎక్కువకాలం జీవించగలుగుతారని పరిశోధకులు కనుగొన్నారు.

Read More: బ్రెయిన్ షార్ప్‌గా పనిచేయాలా?.. ఇలా చేయడం బెటర్

Advertisement

Next Story

Most Viewed