మానసిక ఒత్తిడివల్ల లావు పెరుగుతారా?.. నివారణ ఎలా?

by Javid Pasha |   ( Updated:2024-01-15 12:23:30.0  )
మానసిక ఒత్తిడివల్ల లావు పెరుగుతారా?.. నివారణ ఎలా?
X

దిశ, ఫీచర్స్ : స్థాయికి మించిన మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి కూడా వ్యక్తులు లావు పెరగడాన్ని ప్రేరేపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఒక వ్యక్తి ఎందుకు స్థూల కాయంగా మారతారో తెలిసిన విషయమే. మనం ఎనర్జీ రూపంలో ఖర్చే చేసే దానికన్నా, ఎక్కువ కెలోరీలను తీసుకోవడంవల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అయితే అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు కూడా శరీరంలో ఇటువంటి పరిణామాలు జరుగుతాయని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల తినాలనే కోరిక విపరీతంగా పెరిగిపోతుంది. క్రమంగా అది ఒబేసిటీకి దారితీస్తుంది. అంతేకాకుండా హై స్ట్రెస్‌వల్ల నిద్రలేమి, బ్లడ్ షుగర్ లెవల్స్‌ పెరగడం సంభవిస్తాయి. క్రమంగా బాడీ ఫ్యాట్స్ పెరగడమే కాకుండా టైప్-2 యాబెటిస్‌కు దారితీస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.

మెంటల్ అండ్ వర్క్ స్ట్రెస్ స్థూలకాయం పెరగడానికి ఎలా కారణం అవుతుందో తెలుసుకోవడానికి లీడ్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 800 మందిని రెండేండ్లపాటు అబ్జర్వ్ చేశారు. ఒత్తిడికి గురైనప్పుడు వారిలో షుగర్ లెవెల్స్ పెరగడం, అలాగే సాధారణ స్థితికి చేరుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం గుర్తించారు. ఒత్తిడి లేని సమయంలో పరిశీలించినప్పుడు పెరిగిన షుగర్ లెవల్స్ నార్మల్ స్థాయికి చేరుకోవడానికి పట్టే సమయం కన్నా, ఒత్తిడి ఉన్న సమయంలో ఏడురెట్లు ఎక్కువ సమయం తీసుకున్నట్లు కనుగొన్నారు. పైగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడంవల్ల మానవ శరీరం ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ మోడ్‌లోకి వెళ్లి ఆకలిని, షుగర్ లెవల్స్‌ను పెంచుతుంది. దీనివల్ల లావు పెరుగుతారు. ఇటువంటి పరిస్థితిని నివారించాలంటే ఒత్తిడిలేని జీవన శైలిని అలవర్చుకోవాలి. ఇక తప్పని పరిస్థితిలో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డైలీ డీప్ బ్రీతింగ్స్, యోగా, అదర్ స్ట్రెస్ రిలీఫ్ వర్కవుట్స్ చేయడంవల్ల మేలు జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed