ఆల్కహాల్ వ్యసనానికి ఇక పర్మినెంట్ సొల్యూషన్.. జెన్ థెరపీని కనుగొన్న పరిశోధకులు

by samatah |   ( Updated:2023-08-16 14:35:49.0  )
ఆల్కహాల్ వ్యసనానికి ఇక పర్మినెంట్ సొల్యూషన్.. జెన్ థెరపీని కనుగొన్న పరిశోధకులు
X

దిశ, ఫీచర్స్ : మద్యపాన అలవాటు కొందరిలో తీవ్రమైన వ్యసనానికి దారితీస్తోంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే భవిష్యత్తులో ఇక అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్‌లోని బీవర్‌టన్‌‌లో గల ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీలోని నేషనల్ ప్రైమేట్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఈ అడిక్షన్‌ను శాశ్వతంగా తగ్గించగల ‘జెన్ థెరపీ’ని కనుగొన్నారు. ఇది హెవీ ఆల్కహాలిక్ అడిక్షన్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా సహాయపడుతుందని చెప్తున్నారు.

వాస్తవానికి దీర్ఘకాలంగా మద్యం సేవించే అలవాటు క్రమంగా వ్యసనంగా మారడంలో డొపమైన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మోస్ట్ అడిక్టివ్ పదార్థాల మాదిరిగానే ఆల్కహాల్ మెదడులో డొపమైన్ హార్మోన్ విడుదలను ప్రేరేపిస్తుంది. నిజానికి ఇదొక రకమైన న్యూరోట్రాన్స్‌మిటర్. వ్యక్తికి ఆనందంతోపాటు గొప్ప రివార్డెడ్ ఫీలింగ్స్ కలిగిస్తుంది. ఒక నిర్దిష్ట ప్రవర్తనను రిపీట్ చేయడానికి ప్రేరేపిస్తుంది. అలా కొంతకాలం తర్వాత క్రమంగా డొపమైన్ రిలీజ్ అవడం తగ్గిపోతుంది. దీంతో మద్యానికి బానిసైన వ్యక్తులు మునుపటిలా ఆనందాన్ని పొందలేరు. వ్యసనాన్ని వదులుకోకపోగా మరింత బానిసలవుతారు. ఇది గుర్తించిన పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా మాక్ కోతులపై ప్రయోగాలు నిర్వహించారు. ఎంపిక చేసిన మంకీస్‌‌లకు మనుషుల మాదిరిగానే కొంతకాలం పాటు మద్యం తాగడాన్ని అలవాటు చేశారు. ఆ తర్వాత జన్యువులను ప్రభావితం చేయగలిగే గ్లియల్-డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (GDNF) అనే ప్రోటీన్‌ను ఆల్కహాల్-అడిక్టెడ్ కోతులకు ఇంజెక్ట్ చేశారు. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్‌ను యూజ్ చేస్తూ బ్రెయిన్‌లోని అడిక్షన్ అండ్ రివార్డెడ్ రీజనబుల్‌ను మార్గనిర్దేశం చేశారు. దీంతో వ్యసనపరులైన కోతుల్లో 90 శాతం వరకు మద్యపానం సేవించే అలవాటు తగ్గింది. భవిష్యత్తులో మానవుల్లో కూడా ఈ విధమైన ట్రీట్మెంట్‌ను అందుబాటులోకి తేవడానికి అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు.

Read More: పడుకునేటప్పుడు చందమామకథలు వింటున్నారా? నెక్ట్స్ డే మీ కలను చెక్ చేసుకోండి.. అచ్చం అలాగే..

Advertisement

Next Story