- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవ హృదయాల్లోకి చేరుతున్న మైక్రోప్లాస్టిక్స్.. అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్: వరల్డ్‌వైడ్‌గా పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకం పర్యావరణంతోపాటు మానవాళి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని అమెరికన్ కెమికల్ సొసైటీ నివేదికలు ఇప్పటికే పేర్కొన్నాయి. తాజాగా చైనాలోని బీజింగ్ అంజెన్ హాస్పిటల్‌కు చెందిన కున్ హువా, జియుబిన్ యాంగ్ అనే శాస్త్రవేత్తలు అధ్యయనం మరో పిడుగులాంటి అంశాన్ని వెల్లడించింది. భూ వాతావరణంతోపాటు అనేక పదార్థాల్లో, చివరికి మానవ రక్తంలో, ఊపిరితిత్తుల్లో కూడా మైక్రోప్లాస్టిక్ చేరుతోందని వారు స్పష్టం చేశారు. భయంకరమైన విషయం ఏంటంటే.. మాన హృదయాల్లోకి వేలకొద్దీ మైక్రో ప్లాస్టిక్స్ కణాలు చేరుతున్నాయి. మట్టిలో, నీళ్లల్లో, మంచులో, వేసుకునే దుస్తుల్లో ఐదు మిల్లీమీటర్లకంటే తక్కువ పొడవైన ప్లాస్టిక్ ముక్కలు ఉంటున్నాయి. అవి నోరు, ముక్కు, కావిటీస్ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు.
చైనీస్ సైంటిస్టులు తమ పైలట్ ఎక్స్‌పైరిమెంట్‌లో భాగంగా మైక్రో ప్లాస్టిక్ కణాలు పరోక్ష, ప్రత్యక్ష బహిర్గతం ద్వారా ప్రజల కార్డియో వాస్క్యులర్ వ్యవస్థల్లోకి ఎలా ప్రవేశిస్తాయనేది లోతుగా స్టడీ చేశారు. ఇందులో భాగంగా వారు హార్ట్ సర్జరీల సమయంలో 15 మంది వ్యక్తుల నుంచి గుండె కణజాల నమూనాలను సేకరించారు. అలాగే పలువురిలో సర్జరీకి ముందు, సర్జరీ అనంతరం బ్లడ్ శాంపుల్స్‌ను తీసుకున్నారు. అనంతరం లేజర్ డైరెక్ట్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్‌తో నమూనాలను ఎనలైజ్ చేశారు.
ఈ సందర్భంగా పరిశోధకులు 8 రకాల ప్లాస్టిక్‌తో తయారు చేసిన 20 నుంచి 500 మైక్రోమీటర్ల వెడల్పు కణాలను కనుగొన్నారు. వీటిలో అధికంగా పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువగా దుస్తులు, ఫుడ్ కంటైనర్లలో, విండో ఫ్రేములు, డ్రైనేజీ పైపులు, ఇండ్లకు వేసే పెయింట్‌లలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయని కూడా శాస్త్రవేత్తులు కనుగొన్నారు. అంతకుముందు వారు సేకరించిన చాలా కణజాల శాంపుల్స్‌లలో కూడా పదుల నుంచి వేల వరకు వ్యక్తిగత మైక్రోప్లాస్టిక్ ముక్కలు ఉన్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వాడకం తగ్గకపోతే భవిష్యత్తులో ప్రపంచ మానవాళి ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
Read More: పచ్చి ఉల్లిపాయను బిర్యానీతో పాటు తింటున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే!