A snake inside a shoe : బయటకు వెళ్లేముందు షూ వేసుకుంటున్నారా?.. ఒక్క క్షణం ఆగి ఈ పని చేయండి.. లేకుంటే!

by Javid Pasha |
A snake inside a shoe : బయటకు వెళ్లేముందు షూ వేసుకుంటున్నారా?.. ఒక్క క్షణం ఆగి ఈ పని చేయండి.. లేకుంటే!
X

దిశ, ఫీచర్స్ : అసలే వర్షాకాలం. పైగా బిజీ లైఫ్ షెడ్యూల్. ఓ వైపు స్కూళ్లకు వెళ్లే పిల్లలు, మరోవైపు ఉద్యోగాలకు బయలు దేరే పెద్దలు పొద్దున్న లేచినప్పటి నుంచి తమ తమ పనుల్లో మునిగిపోతారు. ఇక బయలు దేరాల్సిన సమయం అయిందనే తొందరలో కొందరు చెప్పులు, షూలను సరిగ్గా చూడకుండానే వేసుకొని వెళ్తుంటారు. కానీ ఇది కొన్నిసార్లు ప్రమాదం కావచ్చు. ఎందుకంటే షూలలో కీటకాలు, తేళ్లు, పాములు వంటివి చేరి ఉండవచ్చు. చూడకుండా వేసుకుంటే అవి కాటు వేయడంవల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడవచ్చు. ప్రస్తుతం అటువంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ఇంటిలోని చెప్పుల స్టాండ్‌పై షూస్ పెట్టి ఉన్నాయి. బయటకు వెళ్లే ముందు వాటిని ధరించడానికి అక్కడికి వచ్చిన వ్యక్తికి ఏవో వింత శబ్దాలు వినిపించినట్లు అనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆ వ్యక్తి ఎంతకైనా మంచిదని ఓ సన్నని స్టీల్ రాడ్ తీసుకొని అక్కడ వదిలి ఉన్న షూలను కదిలించాడు. లోపలి భాగాన్ని చెక్ చేసే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా అందులోంచి నాగుపాము బుసలు కొడుతు పడగ విప్పింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో కానీ నీరజ్ ప్రజాపత్ అనే స్నేక్ క్యాచర్ ‘ఎంతకైనా మంచిది వర్షాకాలంలో మీ బూట్లను వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి’ అనే క్యాప్షన్‌తో సంబంధిత వీడియోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్, లక్షల కొద్దీ లైకులతో దూసుకుపోతోంది. ఇది చూసిన నెటిజన్లు కూడా షూలు వేసుకునే ముందు చెక్ చేసుకోవడం మంచిదని కామెంట్లు పెడుతున్నారు.

Video Link Credits to sarp-mitra neeraj prajapath Ista Id

Advertisement

Next Story