- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిప్రెషన్‌కు చెక్ పెడుతున్న ఫిజికల్ యాక్టివిటీస్.. అధ్యయనంలో వెల్లడి
దిశ, ఫీచర్స్: ఫిజికల్ యాక్టివిటీస్ వివిధ మానసిక రుగ్మతలు, తీవ్రమైన డిప్రెషన్ నుంచి దూరం చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. సైకో థెరిపీ లేదా మోస్ట్ పాపులర్ మెడికేషన్ కంటే కూడా శారీరక శ్రమ మెంటల్ డిజార్డర్స్‌ను తగ్గించడంలో 1.5 రెట్లు అధికంగా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. 12 వారాలు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో ఉండే ఫిజికల్ యాక్టివిటీస్ డిప్రెషన్ లక్షణాలను ఎఫెక్టివ్‌గా తగ్గిస్తున్నట్లు వారు కనుగొన్నారు. ఇందుకోసం వారు స్వయంగా పరిశీలించడంతోపాటు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ రివ్యూలో పబ్లిషైన 97 అధ్యయనాలను, 1,28,119 మంది పాల్గొన్న ఫిజికల్ యాక్టివిటీస్ ట్రయల్స్‌ను విశ్లేషించారు. సాధారణ వ్యక్తులతోపాటు గర్భిణులు, బాలింతలు, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధుల బాధితుల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీస్ తీవ్రమైన ఆందోళనలను తగ్గించినట్టు గుర్తించారు.
డబ్ల్యుహెచ్‌ఓ చెప్తున్నదేమిటి?
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 8 మందిలో ఒకరు (970 మిలియన్ల మంది) మానసిక రుగ్మతతో జీవిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంటున్నది. దీని కారణంగా ఏటా సుమారు 2.5 ట్రిలియన్ డాలర్లను ప్రజలు మానసిక రుగ్మతల నుంచి బయట పడేందుకు ఖర్చు చేస్తున్నారు. 2030 నాటికి ఈ ఖర్చు 6 ట్రిలియన్లకు పెరుగుతుందనే అంచనా ఉంది. ఆస్ట్రేలియాలో 16 నుంచి 85 ఏళ్ల వయస్సుగల వారిలో ప్రతీ ఐదుగురిలో ఒకరు ఏడాది పాటు మెంటల్ డిజార్డర్ సమస్యలను ఎదుర్కొన్నారని పరిశోధకుడు డాక్టర్ బెన్ సింగ్ అంటున్నారు. వాకింగ్, రన్నింగ్, ఏరోబిక్, అన్ని రకాల వ్యాయామాలు, శారీక శ్రమ డిప్రెషన్ నుంచి విముక్తి కలిగిస్తుందని చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
భలే జరిగింది, గొడుగు కింద పెళ్లి .. వర్షపు చినుకులే అక్షింతలయ్యాయిగా..