- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Viral Video: మద్యం మత్తులో యువతి చేసిన పొరపాటు.. ఆ తర్వాత సీన్ ఇదే..!
దిశ, ఫీచర్స్: మనుషులన్నాక కొన్నిసార్లు పొరపాట్లు చేయడం సహజంగానే జరిగిపోతూ ఉంటుంది. ఆనందంలోనో, ఆవేశంలోనో, తొంతరపాటులోనో, మద్యం మత్తులోనో కొందరు అలా ప్రవర్తిస్తుంటారు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తుంటారు. తాము చేయాల్సిన వ్యక్తికి కాకుండా మరొకరికి కాల్ చేయడం, ఇంటికి తాళం వేద్దామనుకొని డోర్ వరకు వచ్చి వేయకుండానే కీ జేబులో పెట్టుకెళ్లడం, పొరపాటున తాము ఎక్కాల్సిన బస్సు కాకుండా వేరే రూట్ బస్సు ఎక్కడం వంటివి చేస్తుంటారు. తర్వాత అసలు విషయం గ్రహించి నవ్వుకుంటుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి చేసిన పొరపాటుకు అందరూ ఆశ్చర్యపోవడంతోపాటు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ సమాచారం ప్రకారం.. ఓ యువతి మద్యం చేవించి ఉన్నప్పుడు విమానం టికెట్లు బుక్ చేసింది. ఆ తర్వాత వెళ్లి ఫ్లైట్‌లో ప్రశాంతంగా కూర్చున్నది. ఇంతలోనే పైలట్ విమానం బయలు దేరే విషయమై అనౌన్స్ చేశాడు. అది ఎక్కడికి వెళ్తున్నది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నాడు. కాగా ఇది వింటున్న యువతి ఒక్కసారిగా షాక్ అయింది. తాను పెద్ద పొరపాటు చేశానని అప్పుడు గ్రహించింది. ఏం జరిగిందంటే.. జార్జియాకు వెళ్లాల్సిన ఆ యువతి మద్యం మత్తులో పొరపాటున ఇండియా వెళ్లాల్సిన ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది. పైలట్ అనౌన్స్‌మెంట్ చేసేదాకా గానీ ఇది గుర్తించలేకపోయింది. చివరికి అసలు విషయం తెలిసి తెల్లమొహం వేసింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ఆమె ఓ వీడియో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా క్యూరియాసిటీతో రకరకాల సరదా కామెంట్లతో రియాక్ట్ అవుతున్నారు.
Video Credits to stellaaniii Insta Id