- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడి కారులో వచ్చి.. రోడ్డు మీద టీ అమ్మి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: చల్లటి వాతావరణంలో వేడి వేడి చాయ్ తాగితే వచ్చే ఆ మజాయే వేరు. సీజన్ ఏదైనా చాయ్ కు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఇండియాలో చాయ్ అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే మన దేశంలో గల్లీకో చాయ్ కొట్టు ఉంటుంది. ఇటీవలి కాలంలో ఫ్రాంచైజీల పేరుతో రకరకాల టీ షాపులు వచ్చాయి. అల్లం చాయ్, మసాలా చాయ్, గరమ్ చాయ్.. అంటూ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు. అయితే ముంబైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా చాయ్ అమ్ముతున్నాడు. చాయ్ అమ్మే వ్యక్తి మామూలుగా అయితే బైక్ మీదనో లేక సైకిల్ మీదనో వచ్చి తన షాప్ నడుపుతుంటాడు.
కానీ ముంబైకి చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆడి కారులో వచ్చి ముంబైలోని లోఖండ్‌వాలా రోడ్డు మీద చాయ్ అమ్ముతున్నాడు. లక్షల రూపాయల విలువ చేసే కారులో వచ్చి చాయ్ అమ్మడమేంటని అతడిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అతడి ఐడియా బాగానే వర్కౌట్ అయింది. నిత్యం కాస్ట్లీ కస్టమర్లతో అతడి షాపు కళకళలాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మన్ను శర్మ అనే యువకుడు చాయ్ బిజినెస్ ను వినూత్నంగా చేయాలని ఆలోచించాడు. ఈ క్రమంలోనే ఎంతో ఖర్చు పెట్టి ఆడి కారును కొన్నాడు. ‘ఆన్ డ్రైవ్ టీ’ అనే పేరుతో ‘థింక్ లగ్జరీ.. డ్రింక్ లగ్జరీ’ అంటూ టీ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబైలోని లోఖండ్‌వాలా ఏరియాలో ఓ చెట్టు కింద టీ స్టాల్ ఓపెన్ చేశాడు.
అలా ప్రతి రోజు కారులో టీకి కావాల్సిన వస్తువులు తీసుకురావడం, అక్కడ టీ స్టాల్ సెటప్ చేయడం.. రాత్రి వరకు టీ అమ్మడం .. అనంతరం ఇంటికి అదే కారులో తిరిగి వెళ్లడం.. ఇది అతడి దినచర్య. ఇక అతడి వినూత్న ఆలోచనకు చాలా మందే కనెక్ట్ అయ్యారు. దీంతో అక్కడ కాస్ట్లీ కస్టమర్లు క్యూ కడుతున్నారు. కాగా ఈ ఆడీ చాయ్ వాలా టీ అమ్ముతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నో బిజినెస్ ఈజ్ స్మాల్ బిజినెస్.. రెస్పెక్ట్ ది హార్డ్ వర్క్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. కనీసం కారు పెట్రోల్ ఖర్చు వరకైనా వస్తున్నాయా బ్రదర్ అంటూ మరికొంతమంది ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
Read More... బీచ్‌ల్లోనే ఆ ఫీలింగ్ ఎందుకు..? శబ్దాలు, వాసనతోనేనా..?