లవర్స్ డే స్పెషల్.. మీ ప్రియురాలు ఎక్కడ ఉన్నా ఇంట్లో నుంచే తనివితీరా ముద్దు పెట్టవచ్చు

by Sumithra |
లవర్స్ డే స్పెషల్.. మీ ప్రియురాలు ఎక్కడ ఉన్నా ఇంట్లో నుంచే తనివితీరా ముద్దు పెట్టవచ్చు
X

దిశ, ఫీచర్స్ : పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని ఎన్నో అద్భుతమైన పరికరాలను సృష్టిస్తున్నారు నిపుణులు. ఈ పరికరాలను చూశారంటే అలా కళ్లు తెరిచి చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇలాంటి అద్భుతాలను సృష్టించడంలో చైనా ముందంజలో ఉంటుంది. ఈ దేశం ప్రతిరోజు ఏదో ఒక వింత టెక్నాలజీని ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అయితే వాలెంటైన్స్ వీక్ ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే చైనా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. అదే ముద్దుల పరికరం. ఇదేంటి ముద్దుల పరికరమా, ఇదేలా ఉంటుంది అనుకుంటున్నారా. అయితే అదేంటో, దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముద్దిచ్చే పరికరం..

నేటి కాలంలో, సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందింది. శృంగారానికి కూడా మనుషుల అవసరం లేకుండా ఏఐని ఉపయోగించి శృంగారం చేసే విధంగా టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ముద్దుల పరికరాన్ని కూడా కనిపెట్టారు. ప్రియమైన వారు దూరంగా ఉన్నప్పుడు వారికి ముద్దు ఇవ్వాలనుకుంటే వీడియో కాల్ మాట్లాడుతూ ఈ కిస్సింగ్ మిషన్ ద్వారా ముద్దు తీసుకున్నంత అనుభూతిని పొందవచ్చు. ఈ మిషన్ తో నిజంగా లిప్ కిస్ తీసుకున్నంత ఫీల్ పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

ఈ పరికరాన్ని తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఓ యూనివర్సిటీ తయారు చేసింది. దీన్ని తయారు చేసిన విద్యార్థి ప్రియురాలు దూరంగా ఉండటంతో ఒంటరి తనాన్ని పోగొట్టుకునేందుకు, ప్రియురాలితో ఉన్న దూరాన్ని తగ్గించుకునేందుకు తయారు చేశాడట. ఈ పరికరాన్ని బ్లూటూత్, యాప్ ద్వారా ఫోన్‌కి లింక్ చేస్తుంది.

ఈ పరికరం నోటిలో ఏదైనా వ్యాధి ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తులు కూడా ఈ పరికరంతో ముద్దులు పంచుకుని నిజమైన ముద్దులు పొందిన అనుభూతిని అనుభవించవచ్చు. ఈ యంత్రం సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న జంటలకు, నోటి సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

నిజమైన ముద్దు ఇచ్చిన భావన

ఈ పరికరాన్ని సిలికాన్ మెటీరియల్ తో పెదవులు తయారు చేశారు. ఇది అచ్చం మానవుని పెదవులు ఉన్నట్టుగానే ఉంటాయి. ఈ పరికరం కోసం ఒక యాప్ కూడా రూపొందించారు. దీని కోసం మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు పరికరాన్ని కనెక్ట్ చేసి, విదేశాలలో కూర్చున్న మీ ప్రియురాలికి లేదా ప్రియుడికి కాల్ చేయాలి. ఈ పరికరాన్ని ముద్దు పెట్టుకునేటప్పుడు, శ్వాస, వాయిస్ అనుభూతిని కూడా పొందొచ్చు. ఈ పరికరం చైనీస్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం అలాంటి పరికరం భారతదేశంలో అందుబాటులో లేదు.

Advertisement

Next Story

Most Viewed