- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య భర్త మాట వినాల్సిందే.. మెజారిటీ ఇండియన్స్ అభిప్రాయం ఇదే!
దిశ, ఫీచర్స్ : భారతీయులు మహిళల్ని పొలిటికల్ లీడర్స్‌గా అంగీకరిస్తున్నప్పటికీ.. వారు కుటుంబ జీవితంలో సంప్రదాయక స్త్రీ పాత్రలు పోషించడాన్నే ఎక్కువమంది భర్తలు ఇష్టపడుతున్నట్లు ప్యూ(Pew) రీసెర్చ్ సెంటర్ స్పష్టం చేసింది. 'కుటుంబాలు, సమాజంలో భారతీయులు జెండర్ రోల్స్‌ను ఎలా చూస్తారు' అనే శీర్షికతో చేపట్టిన సర్వే ఆధారంగా ఈ ఫలితాలను వెలువరించింది. మెజారిటీ ఇండియన్స్.. భర్త మాట భార్య తప్పకుండా వినాల్సిందేనన్న భావనతో ఉన్నారని తెలిపింది.
నవంబర్ 2019 నుంచి మార్చి 2020 వరకు 29,999 భారతీయులపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ నెల 2న విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. పది మందిలో దాదాపు తొమ్మిది మంది(87%) భార్య ఎప్పుడూ భర్తకు విధేయురాలిగా ఉండాలనే భావిస్తున్నారని పేర్కొంది. అయితే ఇదే భావనతో ఏకీభవించే స్త్రీల సంఖ్య పురుషుల(67%) కంటే కొంచెం తక్కువగా(61%) ఉంది. ఇక చాలా మంది జెండర్ రోల్స్‌పై ఈక్వాలిటీ ఒపీనియన్స్ వ్యక్తం చేసినప్పటికీ, 62% భారతీయులు పిల్లల సంరక్షణకు స్త్రీ పురుషులిద్దరూ బాధ్యత వహించాలని చెప్పారు. అయితే సంప్రదాయ నిబంధనలు ఇప్పటికీ కొనసాగుతున్న క్రమంలో 34% మాత్రం పిల్లల సంరక్షణను ప్రధానంగా మహిళలదేనని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఈ సర్వే ఫలితాలు పాలిటిక్స్‌లో ఉమెన్ రోల్ గురించి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
పిల్లల విషయానికొస్తే.. కుటుంబంలో ఒక మగపిల్లాడు తప్పకుండా ఉండాలని 94% మంది కంబైన్డ్‌గా కోరుకుంటుండగా, సెపరేట్‌గా ఒక ఆడపిల్ల ఉండాలని 90% భారతీయులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వర్తించే బాధ్యత కుమారులదేనని 60% మంది భావన కాగా.. వివిధ మతాలను బట్టి ఈ అభిప్రాయాల్లో భేదాలున్నాయి. ప్రత్యేకించి కుటుంబాల్లో ట్రెడిషనల్ జెండర్ రోల్స్‌ను అనుసరించడంలో ముస్లింలు ముందుండగా.. సిక్కలు ఈ విషయంలో చివరన ఉన్నారు.