- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీవితంలో భారీ మార్పులకు దారితీసే 8 చిన్న అలవాట్లు..!

దిశ, వెబ్‌డెస్క్: లేవగానే కష్టపడి పనిచేయడమే కాదు.. మన జీవి చిన్న చిన్న అలవాట్లు కూడా మన విజయంపై భారీ ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మన జీవితంలో భారీ మార్పులకు దారితీసే కొన్ని అలవాట్లను నిపుణులు తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం 5 గంటలకు మేల్కొనండి..
రోజును ముందుగానే ప్రారంభించడం వల్ల స్వీయసంరక్షణ, ప్రణాళిక, అలాగే ఒత్తిడి లేని ఉదయపు దినచర్య కోసం అదనపు సమయం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఈ సాధారణ అలవాటు మనల్ని ఇతరుల కంటే ముందజంలో ఉంచుతుంది. ఉదయం లేవడం ద్వారా మైండ్ చురుగ్గా పనిచేస్తుంది కూడా.
ఉదయాన్నే ముందుగా ఒక గ్లాసు నీరు తాగండి..
మీరు నిద్రలేచిన వెంటనే శరీరాన్ని హైడ్రేట్ చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శక్తి స్థాయిలను పెంచడంలో వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సాధారణ అలవాటు మొత్తం ఆరోగ్యాన్ని అలాగే మానసిక స్పష్టతను కాపాడుకోవడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
కృతజ్ఞత పాటించండి..
కృతజ్ఞత అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచి పోకుండా ఉండటం. మనం ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో, మనకు ఏదో ఒక సహాయం అవసరమైనపుడో మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు. మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే వారు కొందరుంటారు. వీరికెప్పుడూ మనం కృతజ్ఞులమై ఉండాలి. కాగా ఇతరులతో ఎప్పుడూ కృతజ్జత భావంతో ఉండాలి. ఇది మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది.
వ్యాయామం తప్పనిసరి..
వ్యాయామం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులు, మధుమేహం, అధిక బరువు వంటి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం లేదా నడక మొత్తం శ్రేయస్సును పెంచుతుంది.
ప్రతిరోజూ చదవండి..
అది పుస్తకమైనా లేదా వార్తాపత్రిక అయినా, ప్రతిరోజూ కొన్ని పేజీలు చదవితే జ్ఞానాన్ని పొందడంలో సహాయపడుతుంది. చదవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇది మన జ్ఞానాన్ని పెంచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంపుదొందిస్తుంది. మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగిస్తుంది.
ప్రతి ఉదయం మీ మంచాన్ని క్లీన్ చేసుకోండి..
జీవితంలో క్రమశిక్షణ అనేది అవసరం. కాగా ఉదయం లేవగానే మీ బెడ్‌ను సర్దుకుంటే.. మైండ్ గందరగోళానికి గురికాకుండా ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి ఓ కారణం మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రతగా ఉండటం కూడా అని నిపుణులు చెబుతున్నారు.
నిద్రపోవడానికి కనీసం 30 నిమిషాల ముందు ఫోన్ ఉపయోగించవద్దు..
ప్రెజెంట్ డేస్‌లో మొబైల్ వాడకం గురించి తెలిసిందే. కానీ నిద్రపోయే ముందు విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. నిద్రించే ముప్పై నిమిషాల ముందు ఫోన్ స్క్రీన్ కళ్లపై పడకుండా చూసుకోవాలి. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.లేకపోతే కళ్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం..
ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల స్ట్రెస్‌కు చెక్ పెట్టొచ్చు. కాగా రోజూ కేవలం 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ధ్యానం ఒత్తిడిని తగ్గించి.. దృష్టిని మెరుగుపరచడానికి, గందరగోళంలో ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
Read More..
Stress Free Life: సంతోషకరమైన ఒత్తిడి లేని జీవితానికి 5 సాధారణ అలవాట్లు..!