- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విటమిన్ లోపాలతో.. పొడిచర్మం
దిశ, ఫీచర్స్: పొడి చర్మానికి ప్రధాన కారణాల్లో సూక్ష్మపోషకాల లోపం ఒకటి. ఇందుకు సంబంధించిన ప్రభావాలు స్కిన్ డ్రైనెస్‌కే పరిమితం కాకుండా ప్రారంభ ముడతలు, దురద, పగుళ్లు తదితర అనేక సమస్యలను కలిగించి ఇన్‌ఫెక్షన్లకు గురిచేస్తాయి. అయితే, చర్మం పైపొర లేదా బాహ్యచర్మం సరైన పనితీరు కోసం తగినంత ఆర్ద్రీకరణ అవసరం. కొవ్వు, ప్రొటీన్లు, నీరు అన్నీ కలగలిసి చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. ఈ లెక్కన విటమిన్, మినరల్ లోపాలు చర్మాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేసి పొడిగా, పొలుసులుగా మారుస్తాయి. ఈ క్రమంలో డ్రై స్కిన్ సమస్య నివారణకు డైట్‌లో ఏయే విటమిన్లు చేర్చుకోవాలో వైద్య నిపుణులు వెల్లడించారు.
B విటమిన్‌లు : ఈ మల్టీవిటమిన్లు శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, పిండి పదార్థాలతో పాటు చర్మం, జుట్టుకు అవసరమైన కొవ్వులను సంశ్లేషణ చేయడంలో సాయపడతాయి. విటమిన్ B1 రక్త ప్రసరణను మెరుగుపరిచి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. అంతేకాదు B2 విటమిన్.. చర్మం, పెదవుల హైడ్రేషన్‌కు అవసరం. అలాగే B3 శరీరానికి అవసరమైన కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఇక B12, B6 లోపం వల్లనే చర్మం పొడిబారుతుంది. పొలుసులతో కూడిన ప్యాచెస్‌తో డ్రైగా మారుతుంది. చేపలు, మాంసం, పాలు, గుడ్లు, బలవర్థకమైన తృణధాన్యాలు, బంగాళాదుంపలతో పాటు పిండి పదార్థాలు గల కూరగాయలు వంటి విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాన్ని పుష్కలంగా తినడం వల్ల చర్మానికి పోషణ లభిస్తుంది.
విటమిన్ ఎ : ఇది చర్మ కణాల మరమ్మతు, పునరుత్పత్తికి అవసరం. దీని లోపం వల్ల చర్మపు మృతకణాలు పేరుకుపోతాయి, ఇది తామర, వాపు వంటి సమస్యలను మరింతగా కలిగిస్తుంది. అందువల్ల క్యారెట్, బచ్చలికూర, బత్తాయి, నారింజ, మామిడి, బొప్పాయి, కాలేయం, గొడ్డు మాంసం, చికెన్, చేపలు, గుడ్డు, గోధుమలు, సోయాబీన్ మొదలైన ఆకుపచ్చ, పసుపు, నారింజ కూరగాయల నుంచి తగినంత మొత్తంలో విటమిన్ ఎ పొందాలి.
విటమిన్ డి : సూర్యరశ్మి లేదా సూర్యకాంతిని 'విటమిన్ డి' అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ ఎముకలు, దంతాల ఆరోగ్యానికి ముఖ్యమైంది. 'విటమిన్ డి' చర్మం ఎపిడెర్మిస్‌లో ఉంటుంది. కాగా విటమిన్ 'డి' లోపం ముఖ్యమైన సూచనల్లో పొడి చర్మం ఒకటి. విటమిన్ డి రక్షిత చర్మ అవరోధం ఏర్పడటానికి కూడా బాధ్యత వహిస్తుంది. ఇది చర్మం తన రక్షణను బలోపేతం చేయడానికి, మొటిమలు, ముడతలు, ఫైన్ లైన్లను కూడా నిరోధించడంలో సాయపడుతుంది. మీరు సూర్యకాంతి(సురక్షితమైన సమయాల్లో)తో పాటు రెడ్ మీట్, గుడ్డులో పచ్చసొన, కొవ్వు చేపలు, అల్పాహారం తృణధాన్యాలు, నారింజ, సోయా పాలు, పుట్టగొడుగులు, ఓట్ మీల్ మొదలైన ఆహారం నుంచి 'విటమిన్ డి' పొందవచ్చు.
విటమిన్ 'ఇ' : ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా, తేమగా ఉంచడంలో సాయపడే ముఖ్యమైన విటమిన్. విటమిన్ 'ఇ' అనేది లిపిడ్లకు ఆయిల్ బేస్. ఇది వాపు, వృద్ధాప్య ప్రారంభ ప్రభావాలను తగ్గించడంలో తోడ్పడుతుంది. విటమిన్ 'ఇ' లేకపోవడం చర్మం పొడిబారడం, పగుళ్లను కలిగిస్తుంది. కాగా పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, వేరుశెనగ, గుమ్మడికాయ, మిరియాలు, కుసుమ, సోయాబీన్ నూనె నుంచి 'విటమిన్ ఇ' పొందవచ్చు.
విటమిన్ సి : ఇది చర్మ సంరక్షణకు మంచి సహాయకారి, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా అవసరం. ఈ విటమిన్ లోపంతో చర్మం నీటి శాతాన్ని కోల్పోయి పొడి చర్మం ఏర్పడుతుంది. సిట్రస్ పండ్లు, మిరియాలు, కాంటాలౌప్, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ తదితర పదార్థాల నుంచి 'విటమిన్ సి' పొందవచ్చు.
జింక్ : జింక్ లోపం వల్ల సోరియాసిస్, డ్రై స్కాల్ప్, అటోపిక్ డెర్మటైటిస్ వంటి అనేక సమస్యలతో పాటు తామర కూడా సంభవించవచ్చు. రిచ్ జింక్ డైట్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. జింక్ అధికంగా ఉండే ఆహారాల్లో గుల్లలు, రెడ్ మీట్, పౌల్ట్రీ, పిండి పదార్థాలు, ఎండ్రకాయలు, బీన్స్, గింజలు మొదలైనవి ఉన్నాయి.
Read More: కిడ్నీలకు ప్రాణాంతకంగా 'హై బ్లడ్ షుగర్' ..