- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోటక్ బ్యాంకులో వాటా పెంచిన ఎల్ఐసీ
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వాటాను 0.73 శాతం పెంచింది. ఈ వాటా పెంపుతో సెన్సెక్స్‌లో బ్యాంకు షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీకి చెందిన 14,523,574 షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ఎల్ఐసీ ఇదివరకు ఉన్న 2.45 శాతం నుంచి కోటక్ మహీంద్రా బ్యాంకులో తన వాటాను 3.18 శాతానికి పెంచుకుంది.
దీంతో ఎల్ఐసీ కోటక్ బ్యాంకులో మొత్తం 6,29,92,740 షేర్లను కలిగి ఉంది. ఆర్‌బీఐ నిబంధనలు బ్యాంకులో ప్రమోటర్ వాటాను 26 శాతంగా నిర్దేశించిన కారణంగా, బ్యాంకు ప్రమోటర్లుగా ఉన్న ఉదయ్ కోటక్, అతని కుటుంబం ప్రస్తుతం ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా రూ. 6900 కోట్లకు బ్యాంకులో 2.8 శాతం వాటాను విక్రయించారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకు బోర్డు అక్టోబర్ 26న సమావేశం కానుంది.