విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతాం :రఘునందన్ రావు

by Shyam |
dubbaka
X

దిశ, దుబ్బాక: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన సంవత్సరం తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నిజాం పాలన నుండి స్వాతంత్ర్యం పొందడం జరిగిందన్నారు.

raghunandaan

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కొట్లాడి, ఇప్పుడు ముఖం చాటేయడం ఏంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు బిజెపి పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే వెంటనే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో నిర్మల్ కు అమిత్ షా వచ్చారని అన్నారు.

Advertisement

Next Story