- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిల్ట్ ఇన్ స్పీకర్ అండ్ మైక్ మాస్క్.. లాంచ్ చేయనున్న ఎల్‌జీ
దిశ, ఫీచర్స్ : కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలుండటంతో వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా ‘మాస్క్’ పెట్టుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మాస్క్‌లనే గాడ్జెట్స్‌గా రూపొందిస్తున్నాయి టెక్ సంస్థలు. ఇప్పటికే మార్కెట్లో ఇలాంటి మాస్క్‌లు అందుబాటులో ఉండగా ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఎల్‌జీ ఈ తరహా మాస్క్‌లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఎల్‌జీ ‘ప్యూరికేర్’ పేరుతో తీసుకురాబోయే డిటిజల్ మాస్క్ బిల్ట్ ఇన్ మైక్, స్పీకర్లు కలిగి ఉంటుంది. అయితే చాలామంది ఎదుటివారితో మాట్లాడేందుకు మాస్క్ తీసి తమ సంభాషణ కొనసాగిస్తారు. దీనివల్ల మాస్క్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాస్క్ ధరించే ఎదుటివారితో స్పష్టంగా మాట్లాడేలా డిజైన్ చేసింది. అంతేకాదు లైట్ వెయిట్ మాస్క్ కావడంతో గంటలతరబడి ధరించినా ఇబ్బంది అనిపించదని ఎల్‌జీ వెల్లడించింది. మాస్కు వినియోగించే వ్యక్తి శ్వాసను బట్టి ఇందులో అమర్చిన ఎల్‌డీ డ్యుయల్ ఫ్యాన్లు ఎయిర్ ఫ్లోను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తాయి. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఈ మాస్కు 8 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. తొలిగా థాయ్‌లాండ్‌లో ఈ మాస్క్‌లు విడుదల చేయనుండగా, ఆ తర్వాత దశల వారీగా వివిధ దేశాల్లో మార్కెట్లో రిలీజ్ చేయనున్నారు. ఇక టోక్యో ఒలింపిక్స్ పాల్గొంటున్న 120 మంది థాయ్‌లాండ్ అథ్లెట్లు, కోచ్‌లతో పాటు సహాయక సిబ్బంది ప్యూరికేర్ మాస్కులను ధరించనున్నారని ఎల్‌జీ ప్రకటించింది.
అమెరికన్-సింగపూర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రేజర్ కూడా ‘ప్రాజెక్ట్ హజల్’ పేరుతో టెక్ ఆధారిత మాస్క్‌లను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఈ కొత్త స్మార్ట్ మాస్క్‌లు వాయిస్-ఆంప్ టెక్నాలజీతో వస్తున్నాయి. దీనివల్ల మాస్క్ ధరించి మాట్లాడినా మైక్, యాంప్లిఫైయర్‌లు సమన్వయంతో మాట బిగ్గరగా వినిపిస్తుంది. అంతేకాదు మాస్క్‌లో అమర్చిన లైట్లు, చీకట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వెలుగును పంచుతాయి. ఎయిర్ ఫ్లో టెక్నాలజీ సాయంతో మాస్క్ బయటి నుండి చల్లని గాలిని తీసుకుని, నిశ్చ్వాసలోని CO2ను తొలగిస్తుందని కంపెని వివరించింది .