ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ కీలక ఒప్పందం!

by Harish |
ev charging
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెక్-లాజిస్టిక్స్ కంపెనీ లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాల సంస్థ ఈవీఆర్‌వీ‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కోసం పార్కింగ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అందించడానికి ఈ ఒప్పందం చేసుకున్నామని, ఈ భాగస్వామ్యంలో భాగంగా రానున్న 6 నెలల్లోగా దేశవ్యాప్తంగా 1,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈవీఆర్‌వీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈవీఆర్‌వీ 12 నగరాల్లో పార్కింగ్, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తుండగా, దశల వారీగా భవిష్యత్తులో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా పలు నగరాల్లో మొత్తం 1,000 స్టేషన్లను ఏర్పాటు చేయనుంది.

2022 చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లను లెట్‌ట్రాన్స్‌పోర్ట్, ఇంకా ఇతర ఈవీ వాహనాలను కలిగిన వారు ఉపయోగించుకుంటారు. ‘ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ఛార్జింగ్ స్టేషన్, ఇతర మౌలిక సదుపాయాలు కీలకం. ఈ భాగస్వామ్యం ద్వారా తమ ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా ఛార్జింగ్ చేసుకుని, ప్రధాన కార్యకలాపాలపై దృష్టి సారించడానికి వీలవుతుందని’ లెట్స్‌ట్రాన్స్‌పోర్ట్ వివరించింది.

Advertisement

Next Story

Most Viewed