- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాటక రంగాన్ని కాపాడుకుందాం.. పిలుపునిచ్చిన ఎన్నికల కమిషనర్
దిశ, డైనమిక్ బ్యూరో : ఎంతో పురాతన చరిత్ర ఉన్న నాటక రంగం నేడు క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటుందని రాష్ట్ర ఎలక్షన్ కమిషర్ సి.పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో గురువారం అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2021 ఇన్విటేషన్‌ను పార్థసారథి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటక రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని, కళా రంగమే కుదేలు అయిపోయిందన్నారు. నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు.
చదువుకునే పిల్లలకు నాటకం అలవాటు చేస్తే జ్ఞాపక శక్తి మెరుగవతుందని పేర్కొన్నారు. అభినయ రంగస్థల ట్రస్టు గత 16 సంవత్సరాలుగా థియేటర్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని, రంగస్థల కళలను, కళాకారులను ప్రొత్సహించేలా పలు కార్యక్రమాలు చేపడుతుందని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ పాల్గొన్నారు.