‘మావోయిస్టులు ఇప్పటికైనా హింసను విడనాడి జనజీవన స్రవంతిలోకి రండి’

by Shyam |
‘మావోయిస్టులు ఇప్పటికైనా హింసను విడనాడి జనజీవన స్రవంతిలోకి రండి’
X

దిశ, ములుగు : మావోయిస్టులు ఇప్పటికైనా హింసను విడనాడి జనజీవన స్రవంతి లోకి రావాలని ములుగు ఏస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ మావోయిస్టులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ సమీపంలో దొరికిన మావోయిస్టు పార్టీ దాచిన పేలుడు పదార్థాలను విలేకర్ల సమావేశంలో చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీ మందుపాతరల వల్ల అటవీ ప్రదేశాలలో సాధారణ ప్రజలు, జంతువులు ప్రమాదాలకు గురవుతున్నాయని మావోయిస్టుల కారణంగానే బిల్ట్ ఫ్యాక్టరీ పై ఆధారపడి జీవించే వేల కుటుంబాలు ఈరోజు ఉపాధిని కోల్పోయారన్నారు.

ములుగు, భూపాలపల్లి జిల్లాలు అభివృద్ధి చెందడం మావోయిస్టు పార్టీకి ఇష్టం లేదని అభివృద్ధిని నిరోధించడం ద్వారా యువతను వారి వైపు ఆకర్షించుకోవడానికి మావోయిస్టు పార్టీ వారు ప్రయత్నిస్తున్నారన్నారు. కావున యువత అసాంఘీక శక్తుల బారిన పడకుండా మీడియా రంగం కృషిచేయాలని ఈ సందర్భంగా జర్నలిస్టులందర్ని కోరారు. ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ వారు హింసను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ జీవితం గడపాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed