- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం..
X
దిశ, రాజేంద్రనగర్: హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దీంతో స్థానికులు కంటిమీద కునుకులేకుండా జీవనం సాగిస్తున్నారు. ఆ చిరుతను పట్టుకోవడానికి గత కొంతకాలంగా ఫారెస్టు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, అది ఎవరికీ చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాజేంద్రనగర్ వాసులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
హిమాయత్‌సాగర్ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో బుధవారం చిరుత మరోసారి ప్రత్యక్షమైంది. పశువుల కొట్టంపై దాడి చేసి తెల్లవారు జామున లేగదూడను చంపేసింది. అది గమనించిన అహ్మద్ అనే వ్యవసాయదారుడు శబ్దం చేయడంతో చిరుత పారిపోయినట్లు వివరించాడు. కాగా, మే నెలలో బుద్వెల్ వద్ద రోడ్డు పై కనిపించిన చిరుత.. 4 నెలలుగా ఎవరికీ చిక్కకుండా ఫారెస్టు అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది.
Advertisement
Next Story