- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నదాతకు ఎంత కష్టమొచ్చే..
దిశ, వెబ్‌డెస్క్ : కనీస మద్దతు ధర, సాగు చట్టాల రద్దు కోరుతూ పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు చేస్తుంటే.. గుంటూరు చెందిన కౌలు రైతు మాత్రం తన బాధలు ఎవరికి చెప్పాలో తెలీక ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవల ఏపీని నివర్ తుఫాన్ కుదిపేయడంతో మరికొద్ది రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించినా, ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు.
దీంతో గుంటూరు జిల్లా కాకుమాను మండలం పెద్దివారిపాలెంనకు చెందిన కౌలు రైతు హరిబాబు రైలు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని బాపట్ల జమ్ములపాలెంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. తుఫాన్ దెబ్బకు హరిబాబు రూ.6 లక్షలు నష్టపోయినట్లు సమాచారం. అప్పుల భారం ఎక్కువ అవడంతో అవి తీర్చే స్థోమత లేక ఈ చర్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఘటనా స్థలికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.