- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంక్షోభంలో భారతీయ వ్యవసాయం : ప్రముఖ జర్నలిస్టు జయదీప్ హర్ధికర్
దిశ ప్రతినిధి, వరంగల్: భారతీయ వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృతమైన మార్పులు రావాలని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావాలంటే రైతులకు వినియోగదారులకు వ్యవస్థలను అనుసంధానం చేయాలని మహారాష్ట్ర వ్యవసాయ రంగ విశ్లేషకులు, ప్రముఖ జర్నలిస్టు జయదీప్ హర్థికర్ అన్నారు. ఆదివారం మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో ‘సంక్షోభంలో భారతీయ వ్యవసాయం-రాంరావ్ ఒక కథ’ అనే అంశంపై ఆన్‌లైన్‌లో జూమ్ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో జయదీప్ హర్థికర్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టివేయపడుతోందని.. రైతుల్లో సంఘటిత వ్యవస్థలేదని చెప్పారు. ఆరుగాలం కష్టపడిన రైతులు అప్పులు, అవమానలతో ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల్లో చిత్తశుద్ధి లేదని, సామాన్య, పేద రైతులకు భారత ప్రభుత్వ శాస్త్రవేత్తల అవిష్కరణలు, ఫలితాలు అందడం లేదన్నారు. విదర్భ, తెలంగాణ, మహారాష్ట్ర, బీహర్, ఉత్తరప్రదేశ్, నాందేడ్, మధ్యప్రదేశ్‌లో రైతులు ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. 1990వ దశకంలో విదర్భ సహ దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు- సంక్షోభం, రైతుల అవస్థలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం రైతుల ఆర్థిక కష్టాలు, ఆత్మహత్యలను విశ్లేషణాత్మకంగా చర్చించినట్లు తెలిపారు. సంస్థాగతమైన మార్పులతో పాటు వ్యవస్థీకృతమైన విప్లవాత్మకమార్పులతోనే వ్యవసాయ రంగాన్ని గాడిలో పడుతోందని చెప్పారు. సామాజిక, సహకర వ్యవసాయంతో రైతులకు బేరమాడే శక్తి లభిస్తోందని చెప్పారు.
సకల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని ప్రజలతో అనుసందానం చేయాలన్నారు. ప్రభుత్వాలు చిన్న రైతులను సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పారు. ఈ సమావేశంలో సంయోజకులుగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు వ్యవరించగా డాక్టర్ కొట్టే భాస్కర్, జేమ్స్ ప్రశాంత్, బజార్ రంగారావు, డాక్టర్ దొంతి నర్సింహరెడ్డి, ప్రీతిశర్మ, నవీన, ప్రదీప్, ప్రొఫెసర్ సీహెచ్.బాలరాములు, డాక్టర్ సోమరాతి భిక్షపతి, పెండ్లి అశోక్ బాబు, అమీర్బగ్, అర్జున్ రావు, ప్రొఫెసర్ బిష్ణుచరణ్ చౌదరి, హరిభూషన్, మహేన్రెడ్డి, మనోజ్ రెడ్డి, రాజమౌళి, శ్రీధర్రాజు, స్వాతిమిశ్రా, మార్నేని ఉదయబానురావు తదితరులు పాల్గొన్నారు.