- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పక్కనే గోదారి.. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు
దిశ, గోదావరిఖని : సింగరేణి ప్రాంతమైన రామగుండంలో నీటి సమస్య వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకేమో గోదావరి నది తలాపున పారుతున్నది. కానీ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత ప్రజలకు నీటి సమస్య తలనొప్పిగా మారుతోంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయి. గోదావరి నది పక్కన పారుతున్నా తాగునీటి కోసం ప్రజలు ఎదరుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఎల్బీనగర్‌లో తాగు నీటి సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
గత నెల రోజుల నుంచి మంచి నీటిని సరఫరా చేస్తున్న సింగరేణి యాజమాన్యం హఠాత్తుగా ఎల్బీనగర్ పైపులైను మూసివేయడంతో కాలనీ వాసులు మంచి నీళ్లు రాక పడరాని పాట్లు పడుతున్నారు. మంచినీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నా సింగరేణి యాజమాన్యం స్పందించడం లేదు. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి మంచి నీటిని సరఫారా చేయాలని వారు కోరుతున్నారు. లేనియెడల ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.