'ఆ ఆలోచనను మానుకోవాలి'

by Shyam |
ఆ ఆలోచనను మానుకోవాలి
X

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని ట్రైడెంట్ చక్కర పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా, ముందస్తు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా లే ఆఫ్ ప్రకటించి కార్మికులను రోడ్డున పడేయలనే ఆలోచనల్ని మానుకోవాలని, తక్షణమే లే ఆఫ్ నిలిపివేయాలని పరిశ్రమ సీఐటీయూ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజారత్నం డిమాండ్ చేశారు. లే ఆఫ్ ను నిరసిస్తూ 6వ రోజు పరిశ్రమ వద్ద హాజరు పాయింట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లే అఫ్ తో కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు చేల్లించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ లే అఫ్ విషయంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యూసుఫ్, రాజశేఖర్ రెడ్డి, రాములు, మొహమ్మద్, తదితరులు, కార్మికులు ఉన్నారు.

Advertisement

Next Story