హాట్ స్టార్ లో అక్షయ్ ‘లక్ష్మీబాంబ్’ విడుదల ?

by  |
హాట్ స్టార్ లో అక్షయ్ ‘లక్ష్మీబాంబ్’ విడుదల ?
X

దిశ వెబ్ డెస్క్: కరోనా నుంచి అందరూ బయటపడి .. మళ్లీ సాధారణ పరిస్థితులు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ క్యాన్సిల్ కావడంతో .. సినిమా నిర్మాతలంతా చాలా ఇబ్బందుల్లో పడిపోయారు. కొన్ని షూటింగ్ లు పూర్తయిన విడుదలకు నోచుకోని పరిస్థితి. లాక్డౌన్ ఎత్తేసిన ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పట్లో కనిపించడం లేదు. దీంతో ఈ నష్టాల నుంచి.. బ‌య‌ట‌ప‌డేందుకు నిర్మాణ సంస్థ‌లు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. దానికి మధ్యే మార్గంగా .. సదరు నిర్మాతలు డిజిటల్ ప్లాట్ ఫాంలో తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఓటీటీలు చూసే వీక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అంతేకాదు ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు భారీగానే చెల్లించేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ చిత్రం హాట్ స్టార్ వేదికగా విడుదలకు సిద్దమవుతోంది.

రాఘవ లారెన్స్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కాంచన’. ఈ సినిమాను బాలీవుడ్‌లో ‘లక్ష్మీ బాంబ్’ అనే పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావించినా ..క‌రోనా కార‌ణంగా అది సాధ్యమయ్యేలా లేదు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో లక్ష్మీ బాంబ్ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మూవీ యూనిట్. దీనికి సంబందించి ఇప్పటికే మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ వారితో సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రటటన రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, మిక్సింగ్, వీఎఫ్‌ఎక్స్ పూర్తయినట్లు తెలుస్తోంది

tags: laxmi bomb, hotstar, akshay kumar, raghava lawrence


Next Story

Most Viewed