- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత వృద్ధి అంచనాను పెంచిన డెలాయిట్ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉంటుందని ప్రముఖ డెలాయిట్ ఇండియా వెల్లడించింది. దేశంలో వినియోగ ఖర్చు, ఎగుమతులు పెరగడం, మూలధన వ్యయం కారణంగా దేశ వృద్ధి మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రధానంగా మధ్య-ఆదాయ వర్గాల్లో పెరిగిన కొనుగోలు శక్తి కారణంగా వృద్ధి వేగవంతంగా ఉంది. ముఖ్యంగా ప్రీమియం లగ్జరీ ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ అధికంగా ఉంది. వీటికితోడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుండటంతో భారత వృద్ధి ఊపందుకుంటోంది. ఈ క్రమంలో గత ఆర్థిక సంవత్సరానికి(2023-24) సంబంధించి వృద్ధి అంచనాను 7.6-7.8 శాతానికి పెంచుతూ డెలాయిట్ ఇండియా నిర్ణయించింది. ఇటీవల జనవరిలో 6.9-7.2 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు, అంతర్జాతీయంగా పలు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లలో కోతల కారణంగా వచ్చే ఏడాదిలో సైతం వృద్ధి స్థిరంగా కొనసాగుతూ 6.75 శాతానికి చేరుకుంటుందని డెలాయిట్ ఇండియా ఎకనమిస్ట్ రామ్‌కీ మజుందార్ పేర్కొన్నారు. అయితే, అధిక ఆహార పదార్థాల ధరలు, ఇంధన ధరలు కారణంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఆందోళనలు కొంత ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఏడాది సాధారణ రుతుపవనాల అంచనాతో వ్యవసాయ ఉత్పత్తి సానుకూలంగా ఉంటే ఆహార ధరలపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నట్టు డెలాయిట్ తన నివేదికలో పేర్కొంది.