చైనాకు వ్యతిరేకంగా న్యాయవాదుల ర్యాలీ

by Aamani |
చైనాకు వ్యతిరేకంగా న్యాయవాదుల ర్యాలీ
X

దిశ, భైంసా: భారత్, చైనా సరిహద్దుల్లో గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఘర్షణలో భారత జవాన్‌లు 20 చనిపోవడంతో, చైనా తీరుకు నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కోర్టు నుంచి బస్టాండ్ వరకూ సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం చైనా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అమరులైన భారత సైనికుల ఆత్మకు శాంతి చేకూర్చాలని, భారత ప్రజలు చైనా వస్తువులను బ్యాన్ చేయాలని అడ్వకేట్ సంఘం నేతలు కోరారు.

Advertisement

Next Story